మనుషుల మనస్తత్వం అనుసరణ అనుకరణలపై ఆధారపడి ఉంటుంది మన పెద్దవారు ఎలా చేస్తూ ఉంటారు దానినే పిల్లలు అలవాటు చేసుకుంటారు ఎవరు మంచితనంగా ఉంటారు వారితో ఇతరులు కూడా అంతే మంచితనాన్ని ప్రదర్శిస్తారు అలాగే ప్రేమ కానీ నమ్మకం కానీ స్వచ్ఛమైన స్నేహం కానీ అభిమానంతో ఇతరుల నుంచి ఆశించే ముందు అది మొదట తనలో ఉన్నదా లేదా అని ఆలోచించుకొని అది లేకపోతే దానిని పెంచుకొని ఆ తర్వాత మాత్రమే ప్రయత్నం చేయాలి మన సంతోషాన్ని వేరే వాళ్ళ దగ్గర వెతికితే ఎలా దొరుకుతుంది మన సంతోషాన్ని మనలోనే మనతోనే వెతుక్కోగలిగిన సామర్థ్యం ఉంటే మనం కూడా ప్రతిక్షణం హాయిగా ఆనందంగా ప్రశాంతంగా సంతోషంగా ఉంటాం అన్నది మర్చిపోకూడదు.జామకాయలు తినేవారు ఎక్కువగా దోరగా ఉన్న వాటిని ఇష్టపడతారు కొంచెం వయసు మళ్లీనవారు పండు కోసం ఎగబడతారు చిన్నపిల్లలు అసలు జామకాయ పుట్టుకతో చిన్నగా ఉన్నప్పుడే దానిని కోసుకొని ఎంతో ఆనందంగా తినడానికి ప్రయత్నం చేస్తారు కానీ జామ ఆకులను మాత్రం ఎవరు కోయరు దాని జోలికి వెళ్ళరు కారణం దాని గురించి వీరికి తెలియదు జామ ఆకులు శుభ్రంగా కలిగి నీటిలో పదినిమిషాలు మరిగించి వడకట్టి అందులో కొద్దిగా నిమ్మరసం తేనె కలిపి తాగాలి అప్పుడు ముఖం మీద మొటిమలు మచ్చలు పోయి యవ్వనంగా కనిపిస్తారు ఇవాళ చక్కర వ్యాధి లేని వారు లేరు ఇది తాగడం వల్ల ఆ జబ్బు రాదు స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గుతుంది కొలెస్ట్రాల స్థాయిని తగ్గించడానికి ఈ జామ ఆకులు ఎంతో ఉపయోగపడతాయి.మన మాతృభాష అంటే మనకు ఇష్టం ఉండదు పరాయి భాష మీదేమోజు ఏ భాషలో లేని ప్రత్యేకత మన భాషకే ఉన్నది అన్న విషయం చాలా మందికి తెలియదు అష్టావధానం శతావధానo చేసే ప్రక్రియ ఇతర భాషలలో లేదు అని చెప్పాలి ఈ మధ్యకాలంలో నాగఫణి శర్మ గారి సమాధానాలు హాస్య భరితంగా ఉండి ఆనందాన్ని కలిగిస్తూ అసలు విషయాన్ని జ్ఞాపకం పెట్టుకునేలా ఉంటాయి ఒకరు అడిగిన ప్రశ్న వ్యవసాయ కార్యక్రమంలో పనిచేస్తున్న ఒక అబ్బాయి కుటుంబ నియంత్రణ కార్యాలయంలో పనిచేస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు వాళ్లు తమ పెళ్ళికి వారి వారి సహఉద్యోగులను పిలిచారు వాళ్లు ఆ వధూవరులను ఎలా ఆశీర్వదిస్టారు అన్నదానికి శర్మ గారు చెప్పింది వ్యవసాయ కార్యాలయం వాళ్లు గ్రోమోర్ అంటారు కుటుంబ నియంత్రణ కార్యాలయము వాళ్లు నో మోర్ అంటారు అనేసరికి ప్రేక్షకుల కరతాణ ధ్వనులు ఆకాశాన్ని అంటాయి.
===================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
===================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి