సాధారణంగా కోడి ఇతర పక్షులు గుడ్లు పెడితే లోపల పిల్ల పెరుగుతున్నా గుడ్డు సైజు అంతే ఉంటుంది.కానీ పాము గుడ్డు సైజు పెరుగుతూపోతుంది.పాముగుడ్డు పై పెంకు గట్టిగా ఉండదు.మెత్తగా తోలు లాగా సాగుతుంది.లోపల పాముపిల్లపెరుగుతుంది.అందుకే గుడ్డు సైజుకూడా పెరుగుతుంది అన్నమాట.1/3 వంతు పెద్దగా మారుతుంది పెట్టినప్పటికన్నా! ఇంకో వింత ఏమంటే 3 అడుగుల ఎత్తు మీద నుంచి పాము గుడ్డు ని విసిరేసినా అది పగలదు.పైగా అది బౌన్స్ అవుతుంది.లోపలిపాముపిల్ల పై దవడ కి బాగా మొనదేలిన ఒక దంతం మొలుస్తుంది.దానితో అది గుడ్డు పెంకుని చీల్చి బైట పడుతుంది.ఆదెబ్బతో ఆపన్ను ఊడిపోతుంది.మళ్లీ కొత్త దంతం రాదు.
తాబేలు తాపీగా నడిచేచాలా నిశబ్దంగా ప్రశాంతంగా ఉండే ప్రాణి.కానీ అప్పుడప్పుడు వింత గా ప్రవర్తిస్తాయి.తాబేలుని పెంచే ఓవ్యక్తి రోజూ మెట్లు దిగేవాడుదాన్ని చేతుల్లో పట్టుకుని.తోటలో విడిచి పెడితే ఎంచక్కా పచార్లు చేసేది ఆకూర్మం.పైగా వాకింగ్ చేసి అలసి ఓమూల ఒదిగి కూచునేది.ఒకరోజు దాన్ని కిందకి తీసుకుని వెళ్లలేదు.కాసేపైనాక ఇల్లంతా గాలించినా తాబేలు కనపడకపోటంతో ఖంగారుపడ్డాడు.కిటికీలోంచి చూసి దిమ్మెరపోయాడు.అది ఎంచక్కా తోటలో తనురోజూకూచునే మూల ప్రదేశం లో హాయిగా చిదానందంగా చూస్తోంది.తను రోజు దాన్ని ఎత్తుకుని 20మెట్లుదిగి తోటలోకి వెళ్లి కిందకి దింపుతాడు.మరి ఇది ఇక్కడకి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతూ చేతులతో ఎత్తుకుని మేడమీది తనగదిలోకి వెళ్లాడు.అలా దాన్ని గమనిస్తూ కూచున్నాడు.ఆతాబేలు గునగున లాడుతూగదిబైటకొచ్చి ఎడం కాళ్లతో తోసుకుంటూ మెట్లమీద నుంచి తోటలోకి దొర్లి ఆపై రోజూ తాను కూచునే ఆమూలకెళ్లి బైఠాయించింది.దాని తెలివితేటలు చాకచక్యంకి యజమాని ముక్కున వేలేసుకున్నాడు.
నత్తగుల్లలో నత్త మహాతెలివిగలదిసుమా! ప్రశాంతంగా కష్టపడి తమ పనులు తాము చేసుకుపోతుంటాయి.కానీ వాటికి చెవులు విన్పడవు.తెలివితేటలున్న ప్రాణి నత్త.సరదాగా దానిపై కొందరు ప్రయోగాలు చేశారు.వాటిపై రంగులు చల్లి 20 అడుగుల దూరంలో కొన్ని నత్తల్ని వేర్వేరు దిశల్లో విసిరేశారు.ఆమర్నాడు ఆనత్తలన్నీ ఒకేచోట గుమిగూడాయి.ఆపరిశోధకుడు తమని విసిరేసిన ప్రాంతంని గుర్తు పెట్టుకుని ఎంచక్కా అవి అక్కడే తిరిగి కల్సు కోవడం విశేషం.ఆరంగుల నత్తల్ని పరిశోధకుడు గుర్తుపట్టి ఔరా ఏమి వీటి జ్ఞాపకశక్తి అని అబ్బుర పడ్డాడు.తమకున్న ఘ్రాణశక్తితో అవి తమచౌరస్తాకి చేరాయి.ప్రయోగంకోసం మరీ దూరం గా విసరకూడదుసుమా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి