వేమన అందరికీ తేలికగా అర్థమయ్యే పదాలతో పద్యాలు రాసినవాడు వేమన. వేమనను ప్రజాకవి అంటారు. ఆయన సమాజంలో ఉండే మంచిమంచి విషయాలను గ్రహించి, వాటిని చిన్నపిల్లలు సైతం అర్థం చేసుకునే విధంగా చిన్నచిన్న పదాలతో శతకం రాశాడు. ప్రతిపద్యానికి చివర వాక్యం ‘విశ్వదాభిరామ వినురవేమ’ అని వస్తుంది.వేమన్న ఆశుకవి. ఆయన పద్యాలు ఆయన నోటిలోంచి ఆయన అభిమానుల లేదా శిష్యుల చెవుల్లోకి, వారి హృదయాల్లోంచి తాటాకుల్లోకి ప్రవహించాయి.వేమన పద్యాలలో ఎక్కువగా లోక నీతులు, సామాజిక చైతన్యంనకు సంబంధించినవి ఉంటాయి. అతను సృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు.తన చిన్నతనం నుండి, అతను ఆధ్యాత్మికత మరియు యోగా పట్ల ఆకర్షితుడయ్యాడు. అతను ఈ రెండింటినీ సమానమైనవి మరియు మానవ జీవితానికి అవసరమైనవిగా భావించాడు.వేమన పద్యాలు 19వ శతాబ్దంలో వెలువడ్డాయి. అతని కవితలు ప్రధానంగా ఆధ్యాత్మిక మరియు సామాజిక స్వభావంపై ఆధారపడి ఉంటాయి. మరియు అతని కవితలు యోగా యొక్క ప్రాముఖ్యతపై దృష్టి పెడతాయి. తన జీవితంలో చాలా వరకు, అతను తన శరీరంలో ఒక గుడ్డ ముక్క మాత్రమే ధరించాడు మరియు కొన్నిసార్లు అతను ప్రజల ముందు నగ్నంగా కనిపించాడు. అతని ఫోటోలు చాలా వరకు నగ్న సాధువుగా చూపించబడ్డాయి. అతను తనలోని చెడు అలవాట్లను విడిచిపెట్టి, "సిద్ధ పురుషుడు" అయ్యాడు.ఆ కాలం పరిస్థితులను బట్టి చూస్తే వేమన గొప్ప హేతువాది అని గ్రహింపవచ్చు. సమాజంలో ఎంతో దృఢంగా పాతుకుపోయిన ఆచారాలను, భావాలను అంత నిశితంగా ఎత్తిచూపడానికి చాలా ఆత్మస్థైర్యం, అవగాహన కావాలి.వేమన భోగి…వేశ్యాలోలుడని స్వర్ణం సాధించాడని చివరకు విరక్తి తో యోగి గా మారాడని వేమన యోగిగా మారడంలో వదిన గారి పాత్ర ఉందని, వదిన గారి కుమార్తె మరణం తో విరక్తి తో దేశ సంచారంచేసి యోగి అయి జ్ఞాన సంపదను పామరులకు కూడా అర్థం అయ్యేలా ఆటవెలదుల రూపంలో పద్యాలుగా విరచించాడని ఓ కథ ప్రచారంలో వుంది.ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు వేమన. సాధారణంగా మొదటి రెండు పాదాల్లో నీతిని ప్రతిపాదించి, మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు.ఆయన వ్రాసిన పద్యాలు ఐదు వేలకి పైగా ఉన్నాయి. మమూలు వాడుక పదాలతో మనసుకు హత్తుకుపోయే జీవిత సారాన్ని ఇముడ్చుకున్న అసాధారణ కవిత ఆయనది. సామాన్యులను నైతిక విలువలు అనుసరించేలా చేయగల మంత్రాలుగా వాటిని పరిగణించడం కద్దు.
వేమన శతకం ;-సి.హెచ్.ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి