న్యాయాలు -586
పరిణామి న్యాయము
*****
పరిణామి లేదా పరిణామ అనగా మార్పు, జీర్ణమగుట, ఫలితము,పూర్ణ వికాసము, అంతము,సమాప్తి,వార్ధకము,ఒక అర్థాలంకారము అనే అర్థాలు ఉన్నాయి.
కాలమును బట్టి ప్రతి వస్తువునకు మార్పు కలుగును లేదా మార్పుకు లోనవుతుందని అర్థము.
దేశ కాల పరిస్థితులను బట్టి కేవలం వస్తువులే కాదు మానవులు, జీవులు, ప్రకృతి ఇలా ప్రతి అంశంలోనూ మార్పులు జరగడం, రావడమనేది సహజం.అదెలాగో చూద్దాం.
శాస్త్ర ,సాంకేతిక, సామాజిక ,పర్యావరణ రంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే నాటికీ నేటికీ అనేక మార్పులు సంభవించడం గమనించవచ్చు.ఈ మార్పులు అనేక పరిణామాల ద్వారానే మానవ నాగరికత అభివృద్ధి దిశగా పయనిస్తోందనేది అక్షర సత్యం.
ఈ పరిణామాత్మక మార్పులను రెండు రకాలుగానూ,రెండు రకాల అర్థాలతోనూ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇందులో మొదటిది సామాజిక మార్పు.రెండవది ప్రకృతిలో మార్పు.సామాజిక మార్పు అనేది ప్రకృతిలో జరిగే మార్పు కంటే చాలా భిన్నంగా ఉంటుంది.రెండూ చలన శీలత కలిగి వున్నప్పటికి మార్పు మాత్రం ఒకే విధంగా వుండదు.ప్రకృతిలో ఓ మొక్క పూవుగా, కాయగా పండుగా మారి రాలిపోవడం , ఋతువుల గమనాగమనం, నిష్క్రమణ ఓ నిర్థిష్టమైన కాల పరిమితిలో జరుగుతుంది.
కానీ మనిషి, సమాజం నిత్య చలనశీలత కలవి కాబట్టి పరిణామాత్మక మార్పులు ప్రకృతి నియమాలంత పద్ధతిగా నిర్థిష్టమైన కాల పరిమితిలో జరగవు.
ఇక రెండో రకమైన అర్థం ప్రకారం కాలమును బట్టి వస్తువులలో వివిధ పరిణామాలు చోటు చేసుకోవడం.ఇది కూడా నాడూ నేడూగా విభజించి గమనిస్తే.. నాణేలు, కాగితపు డబ్బు లేని కాలంలో వస్తువులను ఇతరుల నుండి పొందడానికి ఇచ్చి పుచ్చుకోవడంలో వస్తువులే వుండేవి.వివిధ కులాల వారు, రైతులు తాము చేసిన పండించిన ధాన్యాన్నీ, చేసిన వస్తువులను వారికి ఇచ్చి వారి నుంచి తమకు కావలసిన వస్తువులను పొందే వారు.ఇలా వస్తు మార్పిడి వినియోగం ఆనాటి కాలంలో వుండేది.రాన్రానూ దీని అమలులో ఇబ్బందులు ఉండటం గమనించి కాలానుగుణంగా నాణేలు, కాగితపు డబ్బు రూపేణా వస్తు సేవల కొనుగోలు అనే మార్పు వచ్చింది.
సుఖ జీవనానికి ఉపయోగించే వస్తువుల్లో కూడా సాంకేతిక పరిజ్ఞానంతో చాలా మార్పు వచ్చింది.వడ్లు దంచడం,పిండి రుబ్బడం, నీళ్ళు తోడటం లాంటి వాటికి ఉపయోగించిన వస్తువులు రూపాంతరం చెంది యంత్ర పరికరాలుగా మారి సమయాన్ని మానవశక్తిని వృధా కాకుండా చేయడం మనందరికీ తెలిసిందే.
అవే కాకుండా మానవ జీవన విధానంలోనూ, మనిషి లోనూ మానసికమైన మార్పులు ఎప్పుడు? ఎందుకు? ఎలా ?వస్తాయనే విషయానికి వద్దాం.
ఇది విశాలమైన పరిధి గల అంశం. కానీ క్లుప్తంగా చెప్పాలంటే వీటిల్లో వెంటనే కనిపించే మార్పులు కొన్నయితే,కాల క్రమంలో కనిపించే మార్పులు మరికొన్ని.మరి ఇవి రావడానికి కారణం పరిస్థితుల ప్రభావం, కుటుంబం ద్వారా నేర్చుకున్న విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, ప్రమాణాలు,మతం, మానవ సంబంధాలు మొదలైనవన్నీ ఈ మార్పులు రావడానికి కారకాలు అవుతున్నాయి.
వీటితో పాటు సమాజ జీవనంలో మిళితమైన కళలు, నమ్మకాలు, ఆచారాలు, పద్ధతులు,భాష మొదలైనవి తరానికి తరానికి మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలతో పాటు ఆధ్యాత్మిక,లౌకిక వైజ్ఞానిక, భావోద్వేగాల అంశాలు క్రమ క్రమంగా మార్పులకు లోనవుతూ వుండటం మనం గమనించవచ్చు.
ఈ "పరిణామి న్యాయము" ద్వారా మనం గ్రహించాల్సిన విషయాలు ఏమిటంటే మార్పు అనేది అనివార్యం.అయితే వస్తువుల పరంగా కాకుండా మనకు మనంగా ఎలా మారాలన్నది ముఖ్యం.ఈ సందర్భంగా భౌతిక శాస్త్ర వేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ " మారగలిగే సామర్థ్యమే మనిషి తెలివి తేటలకు కొలబద్ద"అన్నారు.పుట్టినప్పటి నుంచి చివరి దాకా మనిషి నేర్చుకుంటూనే వుంటాడు.తెలివైన వాడు ఎప్పుడూ నిత్య విద్యార్థిగానే వుంటాడని అంటారు. ఇక డార్విన్ జీవజాలం ఏ విధంగా పరిణామక్రమం చెందాయో పరిశోధనలు చేసి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడన్న విషయం తెలిసిందే.
మరి మనం ఈ విశాల ప్రపంచాన్ని నిశితంగా పరిశీలిస్తే మార్పు లేనిది ఏదీ మనకు కనిపించదు. వస్తువులు, జీవన శైలి, విషయాలు... ఇలా ప్రతిదీ మార్పుకు లోనవుతూనే వుండటం మనం గమనించవచ్చు.కదిలే కాలం ఎవరికోసం ఆగదు కాబట్టి కాలంతో పాటు మనమూ పరుగెత్తుతూ కంప్యూటర్, సెల్ ఫోన్ లాంటి ఎన్నో నూతన ఆవిష్కరణలకు దారి తీసిన,మానవీయ విలువలతో సమాజ మార్పు తెచ్చిన వారి మార్గంలో మనమూ నడుద్దాం .మనదైన శైలిలో సృజనాత్మకంగా ఆలోచిస్తూ మనకు సాధ్యమైన రంగంలో నూతన ఆవిష్కరణలు చేస్తూ ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకుందాం.
వురిమళ్ల సునంద, అర్కెన్సాస్ అమెరికాసునంద భాషితం✍️

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి