నీరసించిన పులి ;- ఎడ్ల లక్ష్మి
కారండపు అడవిలో
చురచుర చూపులతో 
బిర బిర అడుగులేస్తూ 
గబగబ అది వస్తుంది !!

ఆకలి కేకలు వేస్తుంటే 
గాండ్రిస్తూ గాయి గాయి చేస్తూ 
అటు ఇటు చూసుకుంటూ 
వేట కొరకు వెళ్తుంది !!

అడవి అంతా తిరుగింది 
ఎక్కడ ఏమి చిక్కకా
డొక్క లోపటికి పోయింది 
కక్కుర్తి తో అది ఆగింది !!

పాపం పాపం ఆ పులి 
అలసిపోయి ఆగింది
 నీరసంగా నిలుచుంది 
దానికి ఆకలి తీరేదేలా ?


కామెంట్‌లు