నైవేద్యం ప్రాశస్థ్యం; - సి.హెచ్.ప్రతాప్
 మనం రోజూ తినే తిండి అనేక సంక్లిష్ట దశాభేదాల్ని దాటుకొని అంతిమంగా మన నోట్లోకొచ్చిపడుతున్నది. ఆ యావత్తు దశాభేదాల్లోను మనిషి చేసే కృషికి అడుగడుగునా సహకరిస్తున్న భగవంతుని లీలా విశేషం ఉంది.మనం అత్యంత ప్రాథమికమైన తిండి అవసరాల కోసం భగవంతుని కృప మీద ఆధారపడి ఉన్నాం. అందుకే ఆ ఆహారద్రవ్యాల్ని ఆహారరూపంలోకి మార్చుకోగలిగిన తరువాత భగవంతుణ్ణి విధివిధానంగా పూజించి వండినవాటిని భగవంతుడి సన్నిధిలో పెట్టి "హే భగవాన్ ! ఇది నీ దయామృతవర్షం. మమ్మల్ని బతికించడం కోసమే నువ్వు దీన్ని సృష్టించావు. నీ ప్రసాదం కావడం చేత ఇది పరమ పవిత్రమైనది." అని కృతజ్ఞతలు చెప్పుకొని దాన్ని భుజించడం ఉత్తమం. ద్రవ్యశుద్ధి చాలా ముఖ్యమైన విషయం. అంటే ఏ విధమైన ధనంతో ఆ ఆహారాన్ని సిద్ధం చేశారు? అది అక్రమార్జితమా? సక్రమార్జితమా? హింసార్జితమా? అహింసార్జితమా? ద్రవ్యశుద్ధి లోపించిన నైవేద్యాల్ని భగవంతుడు తిరస్కరిస్తాడు.భగవంతుడిని నమ్మే వారంతా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఇలా పూజలు చేసే సమయంలో పూజా గదిని లేదా దేవాలయాన్ని శుభ్రం చేయడం దగ్గర్నుంచి నైవేద్యం సమర్పించేంత వరకు ప్రతి ఒక్క పనినీ పద్ధతి ప్రకారమే చేయాలి.దేవుళ్లందరికీ ఎల్లప్పుడూ సాత్విక ఆహారమే సమర్పించాలి. ముఖ్యంగా తీపి పదార్థాలను ఎక్కువగా నైవేద్యంగా సమర్పించాలి.ఎల్లప్పుడూ వెండి, ఇత్తడి, బంగారం లేదా మట్టి పాత్రలలో నైవేద్యం సమర్పించాలి.భగవంతుడికి హోటళ్ల నుంచి ఇతర ప్రాంతాల నుంచి నైవేద్యాలు సమర్పించకూడదు. అలాగే దేవుళ్లకు నైవేద్యం తయారు చేసే వేళ ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి ఆహారాన్ని వాడరాదు.

పూజ ఆచారంలో భాగంగా, మేము దేవునికి ప్రసాదం లేదా నైవేద్యం సమర్పిస్తాము. నైవేద్యం సమర్పించేటప్పుడు , ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి :
మంత్రాన్ని పఠిస్తూ గడియారం వారీగా నైవేద్యంపై పువ్వుతో నీరు చల్లాలి.
సత్యం వర్తేన్ పరిశించియామి ( పగటి సమయంలో, సూర్యాస్తమయానికి ముందు )
రుతం త్వా సత్యేన్  పరిశీలించియామి ( రాత్రి సమయంలో, సూర్యాస్తమయం తర్వాత )
అమృతమస్తు అమృతో పస్తరణమసి.
ఈ క్రింది మంత్రాన్ని పఠిస్తూ నైవేద్యాన్ని 5 సార్లు దేవునికి చూపించాలి
ॐ ప్రాణాయ స్వః
ॐ అపానాయ  స్వః
ॐ వ్యానాయ స్వః
ॐ ఉదానాయ స్వః
ॐ సమానాయ స్వః
____మన ఇష్ట దైవాన్ని మనస్సులో నిలుపుకొని దేవి/ దేవతాభ్యో  నమః అని ప్రార్ధించ్శాలి.

కామెంట్‌లు