హనుమాన్ చాలీసా ప్రాశస్థ్యం;-సి.హెచ్.ప్రతాప్

 హనుమంతుడు భక్తి, ధైర్యం, నిస్వార్ధ సేవకు ప్రతీక. అందుకే శ్రీరామచంద్రుడి పరమ భక్తుడు భగవంతుడు అయ్యాడు. శ్రీరామ నామం జపించిన ప్రతి చోటా తాను ఉంటానని హనుమంతుడు చెప్తాడు. హనుమాన్ ను హృదయపూర్వకంగా ఆరాధించే భక్తుని కష్టాలు వెంటనే తొలగిపోతాయని విశ్వాసం. హనుమంతుని ఆరాధన చాలా సులభం అని మన పెద్దలు చెబుతారు.. రామ నమ స్మరణతోనే భక్తుల రక్షణ, కోరిన కోర్కెలు తీర్చే దైవం అని కోట్కాది మంది భక్త జనుల విశ్వాసం.నమ్మకం. హిందూ గ్రంధాల ప్రకారం రామ భక్తుడైన హనుమంతుడిని సంతోషపెట్టడానికి సులభమైన మార్గం హనుమాన్ చాలీసాను పఠించడం.హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా పఠించే భక్తునికి అతని బాధలు అన్నీ నశిస్తాయి. కోరికలన్నీ నెరవేరుతాయి. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా భగవంతుని అనుగ్రహం పొందడమే కాకుండా జీవితం సంతోషముగా సాగుతుంది అన్నది ఇప్పటికీ భక్తుల అచంచల విశ్వాసం.
 
  తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసాలో హనుమంతుడు చేసిన పనుల గురించి ప్రశంసించే 40 శ్లోకాలు ఉన్నాయి. ఇది అత్యంత శక్తివంతమైన పవిత్రమైన చాలీసా. హనుమాన్ చాలీసా చదవడం వల్ల అద్భుతాలు జరుగుతాయని చాలామంది నమ్ముతారు. ఆరోగ్యాన్ని పదిలంగా రక్షించుకోటానికి హనుమాన్ చాలీసా పారాయణం చాలా బాగా పని చేస్తుందని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు. మందులు వాడుతూ, ఒక క్రమంలో హనుమాన్ చాలీసా చదవితే అద్బుతాలు సాధించవచ్చని అంటున్నారు.వజ్రతుల్యమైన దేహాన్ని పొందేందుకు ఈ స్తోత్రం ఉపయోగ పడుతుంది. జాతకంలో గండ దోషాలు ఉన్నా, మనకున్న వాహానం వల్ల రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే వాటినుంచి తప్పించుకోవచ్చు.ఈ కలియుగంలో మనం పొందే అనారోగ్యాలన్నింటి నుంచి బయటపడేందుకు హనుమాన్ చాలీసా దివ్యమైనటువంటి స్తోత్రం.హనుమాన్ చాలీసా, మహా మృత్యుంజయ మంత్రాలను పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాలి. పిల్లల వయసు 4, 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి వీటిని నేర్పించడం ఉత్తమం. హనుమాన్ చాలీసాలోని 40 శ్లోకాలలో ప్రారంభంలో 2 ద్విపదలు, ముగింపులో ఒక ద్విపద ఉన్నాయి. చాలీసా వివరాలు అతని జ్ఞానం, రాముని పట్ల, కోరిక లేకుండా మనిషి పట్ల ఉన్న భక్తి. భక్తి సాహిత్యం విషయానికొస్తే, తులసీదాస్ తన గురువును స్తుతిస్తూ రెండు ద్విపదలతో పద్యం ప్రారంభించాడు. చాలీసా భాష అవధి భాషలో రాయబడింది.
కామెంట్‌లు