పెద్దలు ఏది చెప్పినా మంచి కోసం చెబుతారు తప్ప ఏదో పాటించాలి అన్న అభిప్రాయంతో మాత్రం కాదు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి వారు చెప్పిన దానివల్ల మనం కోపాన్ని తెచ్చుకోకూడదు ఏం చెప్తున్నారు వాళ్లు నీవు ఫోన్ చేసేటప్పుడు నీ శరీరంలో ఎంత జీర్ణశక్తి ఉందో నీవు ఎంత తింటే జీర్ణించుకోగలవు అంతవరకే తిను అని చెప్పడం కోపంతో నా నీ జీవితానికి సరిపడిన సంపాదన ఉంటే నీ జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది అలా సరిపడా సంపాదించు అని చెప్పడం మంచిది కాదా సైకిల్ మీద గాని మోటార్ సైకిల్ మీద కానీ కారులో గాని వెళ్ళేటప్పుడు నీవు ఎంత కంట్రోల్ చేయగలవు అంత వేగంతోనే ప్రయాణించు లేకపోతే ప్రాణానికి మంచిది కాదు ఏ క్షణాన నైనా ప్రమాదం జరగవచ్చు అని చెప్పడం నీ మంచికేగా అసలు జీవితంలో బాధలు ఎందుకు వస్తాయి పక్క వాడితో పోల్చుకునే వాడిలాగా జీవించలేకపోతున్నానే అన్న మాట మధన కనక ఎవరితోనూ పోల్చుకోకుండా నిన్ను నీతోనే పోల్చుకుంటూ హాయిగా ప్రశాంతంగా జీవించవచ్చు కదా అన్నది పెద్దల సూక్తి.ఏ భాషలోనైనా ప్రతి మాటకు చక్కటి అర్థం ఉంటుంది మాటకు ఎంత విలువ ఉంటుంది అంటే ఒక మాట మాట్లాడితే చాలు ఎదుటి వ్యక్తుల మనసును కష్టపెట్టేలా ఉంటుంది మరేదైనా ఆహ్లాదకరమైన మాటలు చెప్పితే అవతల వాడి మనసు ఎంత ఆనందంతో ఉప్పొంగుతుందో ఊహించలేం ఏదైనా చెడ్డ వార్త చెబితే అతని మనసు ఎంత బాధపడుతుంది బాధల్లో ఉన్న వ్యక్తిని ఓదార్చడానికి కూడా ఈ మాటలే ఉపయోగపడతాయి అదే మాట అవతల వాడి మనసును ముక్కలు చేసేలా ఉంటుంది అలా చేసే అధికారం నీకు ఎక్కడిది కనుక మనం వాడే ప్రతి మాట కూడా అక్కడ సందర్భాన్ని బట్టి అవతలి వారి మనస్తత్వం ని బట్టి వారి వయసును బట్టి ఎలా మాట్లాడాలో నేర్చుకో అంటారు పెద్దలు.నీ బాధలను నీలోనే దాచుకోవాలి అమ్మకు భార్యకు తప్ప ఎవరికీ చెప్పుకోకూడదు ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు అది ఎవరి ద్వారా వచ్చిందో వారితోనే స్నేహపూర్వకంగా మాట్లాడితే అసలు విషయం తెలుస్తుంది దాని పూర్వపరాలు తెలుసుకుంటే ఆ తప్పును సరి చేసుకునే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఆలోచించి మెదడును ఎక్కువ మాటలతో నింపవద్దు అయితే ఎప్పుడు బద్ధకానికి జీవితంలో చోటు ఇవ్వవద్దు ప్రతిక్షణం ఏదో ఒకటి చేస్తూ ఉంటే శరీరం మొత్తం ఎంతో హుషారుగా ఉంటుంది నీ వేదైనా పని చేయదలుచుకున్నప్పుడు నానుస్తూ చేయకు వేగంగా పూర్తి చెయ్ అది నీకు స్ఫూర్తి ని ఇస్తుంది ఎదుటివారికి తృప్తి ని ఇస్తుంది.
.=========================
సమన్వయం ; డా. నీలం స్వాతి
.=========================
సమన్వయం ; డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి