వైరస్‌కు మందు - యామిజాల

 చాలా మందికి నోటి పక్కనో, లోపలో, పెదవుల అంచుల్లోనో ముందు దురదలా మొదలై చిన్న పొక్కుల్లా వచ్చి పుండుగా మారి, క్రమంగా ఎండి, చాలా రోజులకు తగ్గుతుంటాయి. నొప్పి సంగతి అలా ఉంచితే ఇవి తొందరగా తగ్గవు. పెదవులకి పక్కగా మచ్చ పడి ఇబ్బందిగా అనిపిస్తుంటాయి. కోల్డ్‌ సోర్స్‌ గా పిలిచే ఈ పొక్కులు వైరస్‌ల కారణంగా వస్తాయి. పొక్కు రావడానికి ముందు దురద మొదలవగానే కొబ్బరినూనెలో దూదిని ముంచి అక్కడ గంటకోసారి పెట్టడం వల్ల అందులోని లారిక్‌ ఆమ్లం, ఓలియాక్‌ ఆమ్లాలు వైరస్‌ను నాశనం చేస్తాయి. ఐస్‌క్యూబ్‌తో రుద్దడం వల్ల కూడా దురద తగ్గి తొందరగా మానుతాయి. దూదిని హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌లో ముంచి ప్రతి రెండు మూడు గంటలకోసారి పొక్కుల మీద పెడుతుంటే త్వరగా ఎండి, రాలి పెద్దగా మచ్చగా మచ్చపడకుండా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బను చిదిమి ఆ రసాన్ని పొక్కుమీద రెడుమూడు రోజులకోసారి పెడితే ఫలితం ఉంటుంది. లేదంటే పరగడుపున రెండు రెబ్బల్ని తిన్నా అవి త్వరగా తగ్గుతాయి. లేదంటే చిటికెడు సముద్ర ఉప్పును తీసుకుని దాన్ని ఆ పొక్కుల మీద అరనిమిషం పాటు గట్టిగా నొక్కి పెట్టాలి. ఇలా రోజుకి రెండు మూడుసార్లు చేసినా అవి త్వరగా ఊడి వస్తుంటాయి. రోజుకి రెండు మూడు సార్లు తేనెని పొక్కులమీద రాసి, ఏడెనిమిది నిమిషాలాగి కడిగేసినా మంచిదే.

కామెంట్‌లు