కలియుగంలో దాన ధర్మం పాపం నుండి విముక్తికి, పుణ్యాన్ని సాధించడానికి ఉత్తమమైన మాధ్యమంగా వర్ణించబడింది.తనకున్న దానిలో కొంత బాగాన్ని లేని వారికి దానం చేస్తే పుణ్యం దక్కు తుందని భావిస్తారు. దానం చేసే విషయంలో ఒక వ్యక్తి ఎప్పుడూ సమయం కోసం వేచి ఉండకూడదు. దానం చేయడం వలన స్వర్గం సిద్ధిస్తుందని పురాణాల చెబుతున్నాయి. ప్రస్తుతం కాలంలో ధర్మవర్తనమే ఉత్తమమని పెద్దలు చెప్తారు. ఆకలి, అనాధలకు, దుఃఖితులు, రోగులు, బలహీనులు మొదలగు వారందరికీ అన్న.. వస్త్రాలు, ఔషధాలు ఏ రూపంలో సేవ చేసినా అన్నీ దాన ధర్మాల కిందకే వస్తాయి.పగటిపూట వెలిగించిన దీపం, సముద్రంలో కురిసిన వర్షం, తృప్తి చెందిన వ్యక్తికి ఆహారం అందించడం ఎలా పనికిరాదో.. అలాగే ధనవంతుడికి దానధర్మాలు చేయడం కూడా పనికిరాదు.మానవుడు దాన ధర్మం ద్వారానే స్వర్గాన్ని పొందుతాడు, దాన ధర్మం ద్వారానే సుఖాన్ని పొందుతాడు. ఇహలోకంలోను, పరలోకంలోను దానధర్మం మనిషిని పూజనీయుడిని చేస్తుంది.ప్రపంచంలో మాల్టా లైబీరియా ప్రజలకు దాన గుణం ఎక్కువట.వరల్డ్ గివింగ్ ఇండెక్స్ సంస్థ 153 దేశాల్లో నిర్వహించిన సర్వేలో శ్రీలంక, ఐర్లాండ్, కెనడా, గయానా, సియర్రా లియానే వాసుల్లో దానం చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.మానవునికి ఉన్న సుగుణాలలో ఒకటి దానం చేయడం. దానం చేసే వ్యక్తి దానం స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా అని ఆలోచించి లేదా రుజువు చేసుకొని అతను దాన స్వీకరణకు అర్హుడు అయినట్లయితే అతనికి దానం ఇవ్వాలి. దానం స్వీకరించే వ్యక్తి దాన స్వీకరణకు తగిన పాత్రుడు కానప్పటికి అతనికి దానం ఇచ్చినట్లయితే అటువంటి దానాన్ని అపాత్రదానం అంటారు. అపాత్రదానం వలన ఎటువంటి పుణ్యం రాకపోగా దానం తీసుకున్నవారి నుండి వారి పాపాలు మనకు సంక్రమిస్తాయి.శాస్త్రనియమా నుసారం దానయోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటినే దానం చెయ్యాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు.ఈ దానాలను గ్రహణ సమయాల్లో, పర్వదినాల్లో, సంక్రమణాల్లో చేస్తే దాని ఫలం పదింతలు అవుతుంది. ఈ దానాలను భక్తి,శ్రద్ధలతో చేయాలిగాని, దానగ్రహీతకు ఏదో ఉపకారం చేస్తున్నామనే భావనతో చేయరాదు. అలా చేస్తే ఫలితం శూన్యం .
దాన ధర్మాలు;-సి.హెచ్.ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి