శ్లో:
యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతే యత్సహజం వురస్తాదా
యుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః !!
బ్రాహ్మణులు యజ్ఞోపవీతం కు పూజ చేసి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. ఏడాదికి వచ్చే ద్వాదశ పౌర్ణమిల్లో శ్రావణ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది.ఉపనయం సమయంలో ధరించే జంధ్యాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణిమ రోజున పాత జంధ్యాన్ని తీసేసి క్రొత్తదాన్ని ధరిస్తారు దీన్ని ఉపాకర్మ అంటారు. ఉపాకర్మను యఙ్ఞోపవీతం పేరుతో పిలుస్తారు.యజ్ఞోపవీతం అంటే యాగ కర్మతో పునీతమైన దారం అని అర్థం.యఙ్ఞోపవీతం ధరించినవారు ద్విజులు. ద్విజులు అంటే రెండు జన్మలు కలవారని అర్థం. తల్లి గర్భం నుంచి జన్మించడం మొదటిది కాగా, ఉపనయనం అనంతరం గురువు నుంచి ఙ్ఞానాన్ని పొందడం రెండోది. ఉపనయం సమయంలో యఙ్ఞోపవీతానికి జింక చర్మాన్ని కడతారు.దీనిని ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు విసర్జిస్తారు.శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది.
భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది.జ్ఞాన స్వరూపిణి అయిన గాయత్రీ మంత్రం భూమికి దిగివచ్చినది, ఆ మంత్రఅధిష్టాన దేవత వచ్చినది, యజ్ఞోపవీతం తయారైనదీ ఈరోజే. అందుకే జంధ్యాల పౌర్ణమి అనికూడా అంటారు.యాగకర్మ చేత పునీతమైన దారం అని అర్థం. పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతం దివ్యౌ షధం. యజ్ఞోపవీతానికి ఉండే ముడిని ”బ్రహ్మ ముడి” అంటారు. యజ్ఞోపవీతం యొక్క నవ తంతుల్లో, ఓంకారం, నాగదేవతలు, సోముడు, పితరులు, ప్రజాపతి, వాయువు, సూర్యుడు, యితర దేవతలు, ఉత్తమ దేవగణాలు కొలువై ఉంటారని పండితులు చెబుతారు.జంద్యం ఎల్లప్పుడూ ఎడమ భుజం నుండి కుడి నడుము వైపు ఉండాలి. ‘ఓం యజ్ఞ ఉపవీతం పరమం పవిత్రం, ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్. ‘ ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం, యజ్ఞోపవీతం బలమస్తు తేజః’ అనే మంత్రాన్ని పఠిస్తూ ధరిస్తారు. ఈ జంద్యంలో 64 కళలు, 32 శాస్త్రాలు నేర్చుకోమని సారాంశం ఉంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి