వృద్ధాప్యపు ఓ ఆశ;- ఐలేని గిరి
 (వృద్ధుల దినోత్సవం సందర్బంగా )
============================
ఇప్పటికీ ఒక ఆశ
సవాళ్ళను స్వీకరించాలని
సమవుజ్జీగా ఉండాలని
స్వతంత్రత చాటుకోవాలని

ఇప్పటికీ ఒక ఆశ
ఆధారిత జీవితం గడపొద్దని
సహాయతకోసం సాగిల పడొద్దని
జాలి చూపుల్లో చిక్కుకోవద్దని

ఇప్పటికీ ఒక ఆశ
జవసత్వాలు కూడగట్టుకోవాలని
జడత్వ పరిష్వంగాన్ని విదిల్చాలని
తోడ్పాటునిచ్చి మెప్పు పొందాలని

ఇప్పటికీ ఒక ఆశ
ముదిమిని జయించాలని!
    *. ***
ఆశ ఓ చోదక శక్తి
బతుక్కి ఎంతో కొంత జీవం పోస్తుంది
జీవించడమంటే
ఆశను బతికించుకోవడమే
     &&&. &&&&

కామెంట్‌లు