1) కోరినంత కోరికలు తీర్చావా పరమేశా
కోమలమైన మనసు నాది రాలేవా పరమేశా !
2) నాదంలో నిర్భయంగా నిలిచినావా ఈశా
నాదనేదీ లేదనే మనసు నిచ్ఛావా పరమేశా !
3) గంగ తల పైన ఉన్నదన్న నమ్మకమా ఈశా
నిజాంత రంగుడివి నమ్మకమే పరమేశా !
4) కామితార్థములు తీర్చడి వాడివి కదా ఈశా
కావలసినది ఏదో తెలియదే నిజం పరమేశా !
5) కనులు మూసి కనులు తెరిచిన నీవే గా ఈశా
కడవరకు కాపాడేది నీవే కదా పరమేశా!
6) కవ్వింతలు, గిలిగింతల మనసు లేదు ఈశా
కరుణతోడ జూడు మయ్యా కరుణామూర్తి వి
పరమేశా !
7) అందరి వాడివి నీవు అందుకోలేను ఈశా
ఆదరించి నా పైన దయజూపుమా పరమేశా!
ఓపరమేశా;- కొప్పరపు తాయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి