చిట్టి పొట్టి గణపయ్యా
చిన్న స్కూటీ ఎక్కావా
నెమ్మదిగా కదిలావా
రమ్మని ఎవరు పిలిచారు
నీవు రై రై మని వస్తావా
రాళ్లు రప్పలు ఉంటాయి
కిందికి ఎలా చూస్తావు
ముందుకెలా నడుస్తావు
నట్ట నడుమ దారిలో
చిట్టచిట్ట వస్తున్నావు
ఎడమ దిక్కుకు వెల్లయ్య
మెల్లగా కోవెల చేరయ్యా
పచ్చని పందిరి వేసాము
పండ్లు ఫలాలు పెట్టాము
బొజ్జ నిండా తినవయ్యా
దీవెనలు మాకు ఇవ్వయ్యా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి