న్యాయాలు -607
ప్రత్యాసత్తి న్యాయము
*****
ప్రత్యాసత్తి అనగా దేశకాల కృతమగు సామీప్యము అని అర్థము.
అనగా సమయాసమయాలను బట్టి ఏ పని చేయించాలన్నా దాని తాలూకు యజమాని దగ్గర ఉంటేనే కావలసిన పని త్వరగా నెరవేరుతుంది అని అర్థము.
ఈ "ప్రత్యాసత్తి న్యాయము" నేటి సమాజంలోని మానవ స్వభావానికి అద్దం పడుతుంది.
ఎవరికైనా ఏదైనా పని అప్పగించి సరిగా చేస్తారులే అని నిశ్చింతగా ఉండే పరిస్థితులు నేడు లేవు.
పని చేయించుకునే వ్యక్తి ఆ ప్రదేశం నుండి ఏ మాత్రం పక్కకు వెళ్ళినా చేసే వ్యక్తుల్లోని నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా పనిలో నాణ్యత లేకుండా పోతుంది.
అందుకే వెనుకటి వారు ఓ సామెత చెప్పేవారు "మంటికైనా ( మట్టికైనా) ఇంటోడే వెళ్ళాలని". అందులో భావం ఒక్కటే మన పని అనుకున్న తర్వాత మనమే దగ్గరుండి చేయించుకోవాలి.అప్పుడే ఆ పని త్వరగా పూర్తి అవుతుంది.
నేడు కొందరు మనుషుల్లో పెరిగిన స్వార్థం, నిర్లక్ష్యం,అతి ధీమా, తలబిరుసు తనం వారు చేసే పనుల్లో నిబద్ధత కోల్పోయేలా చేస్తోంది.తన కడుపు నిండనంత వరకు అయ్యో ఈ దారిద్ర్యాన్ని ఎంత కాలం భరించాలని వాపోయిన వారే తన కడుపు నిండగానే "దరిద్రం అంటే ఎట్లుంటదని" అంటుంటారని, అలాంటి వారి వల్లే మంచి తనం,మానవతకు చోటు లేకుండా పోయిందని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు.
"ఏ పుట్టలో ఏ పాము వుందో" అన్నట్లు ఎవరు ఎలాంటి వారో పసిగట్టడం కష్టంగా ఉంటోంది.
కాబట్టి "ప్రత్యాసత్తి న్యాయము"ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఒక్కటే. మారిన దేశకాల పరిస్థితుల దృష్ట్యా ఎవరి మీదా అతి నమ్మకాలు పెట్టుకోకుండా చేతనైనంత వరకు, సాధ్యమైనంత మేరకు మన పనులు మనమే చేసుకుందాం.అంతే కదండీ!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి