పచ్చదనం అంటేనే ధనం
చెట్లకు పైసలు కాస్తున్నవీ
కోట్లకు పడగలెత్తిన చెట్లు
ఎక్కడపడితే అక్కడ చెట్లే చెట్లు
ప్రతి చెట్టుకు పైసలే పైసలు..!!!?
మనలాగా ఉన్న చెట్లు లేని చెట్లు
అంటే పేద చెట్లు ధనిక చెట్లు ఉన్నాయి
కొన్ని చెట్లు కోట్లు సంపాదిస్తాయి
కొన్ని చెట్లు లక్షలు సంపాదిస్తాయి
మరికొన్ని చెట్లు
కొంచెం కొంచెం వందలు వేలు సంపాదిస్తాయి
ఏది ఏమైనా మనలాగా
సంపాదన లేనేలేని చెట్లే లేవు.!!?
ప్రతి చెట్టుకు పైసలు కాస్తున్నాయి.
ఉన్నోడు లేనోడు కొట్లాడుకుంటాడు
పోటీ పడతాడు కానీ
కోట్లూ సంపాదించిన చెట్లు కొట్లాడుకోవు
పోటీ పడవు.
చెట్లన్నింటి మాట ఒకటే చెట్లు నోట్లను దాచుకోవు
నూరు పారేసుకోవు. మనిషికి దానం చేస్తాయి.!!!
పూల చెట్లు పల్ల చెట్లు మందుల చెట్లు అన్నం చెట్లు ఆహారం చెట్లు కూరగాయల చెట్లు కోట్ల రకాల చెట్లు
వందలు వేలు లక్షలు కోట్లు కాస్తున్నాయి.!!
భూమి భూమంతా మైదానం అంతా చెట్లే
ఇప్పుడు
పచ్చదనమే- ధనం.!?
పాఠశాలలో పచ్చదనం పారిశుద్ధ్యం కార్యక్రమం కోసం రాసిన కవిత.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి