నీవూ నేనూ ఒకటేనని
మన అందరి భావాలూ ఒకటేననీ
ఈ జగాని కంతటికీ మనము తెలుపుదాం
!!నీవూ!!
కుల మతాల అడ్డుగోడ కూల్చి వేద్దాం
వర్గ వర్ణ విభేదాలు రూపు మాపుదాం
ఒకరికి ఒకరం మనమొకరికి ఒకరం
జగమంతా ఒకరుగా ఒకరి కొకరుగా
!!నీవూ!!
దండలోని పువ్వులం నింగిలోని చుక్కలం
ఇంద్రధనువు రంగులం పసిపాపల నవ్వులం
ఈ జగమే ఒక కుటుంబమయి
మానవతా పరిమళాలు వెదజల్లుదాం
!! నీవూ!!
**************************************
జగమంత కుటుంబం;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి