కవిసమ్మేళనంలో ఇంజనీరు రత్నలక్ష్మికి విశిష్ట సన్మానం

 కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య, మన తెలుగుతేజం ఛానల్, ఇండో ఏషియన్ అకాడమీ విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 18/8/2024న బెంగుళూరులో నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని "స్వతంత్ర్య భారతావనిలో మహిళల పాత్ర, ప్రాధాన్యత" అనే అంశంపై మహిళాకవి సమ్మేళనం నిర్వహించగా వివిధ రాష్ట్రాలనుండి విచ్చేసిన 78 మంది లబ్దప్రతిష్టులైన కవయిత్రులు ఇందులో పాల్గొన్నారు.
ఈ కవిసమ్మేళనంలో కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య అధ్యక్షుడు మాల్యాద్రి, అకాడమీ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ ఏకాంబరం నాయుడు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారత మాజీ రాష్ట్రపతులైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు వి వి గిరిల మనుమడుయైన డాక్టర్ సుబ్రహ్మణ్య శర్మ, రవళి మాసపత్రిక సంపాదకుడు మరియు సాఫ్ట్వేర్ సంస్థ డైరెక్టరైన రామశర్మ సమక్షంలో నంద్యాలలోని జలవనరుల శాఖకు చెందిన తెలుగుగంగ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఇంజనీరుగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్. రత్నలక్ష్మి "సుదతులు స్ఫూర్తికర్తలు" అనే శీర్షికతో కవితాపఠనం చేశారు. వారి సాహిత్య సేవలకు మెచ్చి ముఖ్యఅతిథి భారత మాజీ రాష్ట్రపతుల మనుమడైన డాక్టర్ సుబ్రహ్మణ్య శర్మ ఎస్. రత్నలక్ష్మిని సుందరమైన శాలువాతో సన్మానించి అందమైన జ్ఞాపికను మరియు అమూల్యమైన ప్రశంసా పత్రాన్ని స్వహస్తాలతో బహూకరించి సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు కవయిత్రులు, పుర ప్రముఖులు రత్నలక్ష్మిని అభినందించారు.
కామెంట్‌లు