మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించేందుకు తగురీతిలో అంతా సన్నద్ధం కావాలని మండల విద్యాశాఖాధికారి-1 సి.హెచ్. గోవిందరావు అన్నారు. మండల స్థాయిలో గల వ్యాయామ ఉపాధ్యాయులతో స్థానిక మండల వనరుల కేంద్రంలో జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ వచ్చే నెల 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విభాగం నిర్దేశాల మేరకు మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించాలని తెలిపారు. కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎ.గోవిందరావు పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. మొదటి రెండు రోజులు బాలురకు, తర్వాత రెండు రోజులు బాలికలకు ఐదురకాల పోటీలను నిర్వహించేందుకు ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది. మండల విద్యాశాఖాధికారి-2 ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కొత్తూరు మండల శాఖ ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలను నిర్వహించి, విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని అన్నారు. కొత్తూరు మండల శాఖ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు జన్ని చిన్నయ్య మాట్లాడుతూ కబడి, ఖోఖో, వాలీబాల్, షటిల్ బ్యాట్మెంటన్, టెన్నికాయిట్ ఆటల పోటీలను బాలబాలికలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులందరూ విద్యార్థులచే ఎంట్రీ ఫారం నమోదుపర్చేలా, ఎంట్రీ ఫీజు చెల్లించేలా చొరవ తీసుకొని తగు నివేదికను తనకు సమర్పించాలని ఆయన కోరారు. ఎస్ జి ఎఫ్ గౌరవ సలహాదారులు కె.రాజారావు మాట్లాడుతూ సెప్టెంబర్ 10 నుండి జరగనున్న ఈ పోటీలకు ఇప్పటినుంచే తగు తర్ఫీదునిచ్చి విద్యార్థులందరినీ సంసిద్ధం గావించవలసి ఉందని సూచించారు. ఈ మండల స్థాయి విజేతలు నియోజకవర్గ స్థాయి పోటీలకు అర్హులౌతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు జె.చిన్నయ్య, కె.రాజారావు, బి.భాస్కరరావు, జె.శ్రీనివాసరావు, అనితా రెడ్డి, రమేష్, జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొనిరి.
క్రీడా పోటీల నిర్వహణకు సన్నద్ధం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి