అనుకున్నా;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 కారుచీకటి వర్ణం చూసి
మీ కన్నుల సొగసనుకున్నా
వేకువ తెలుపు చూసి 
మీ నవ్వుల మెరుపనుకున్నా 
బంతిచేమంతుల సోయగం చూసి 
మీ ఇంటి గడపనుకున్నా 
ఎరుపు వర్ణం చూసి 
మీ శౌర్య ప్రదీప్త మనుకున్నా
హరితవర్ణ పైరుల చూసి
ఆత్మీయత పంచే 
మీ మది సొగసనుకున్నా
స్నేహ పరిమళాలతో
మీరు సప్తవర్ణ శోభల్లో
మునగాలీ,తేలాలీ
మీ జీవితాన
నానావర్ణ ప్రకట భాస్వత్సుధలు 
వెలయించాలనీ,నించాలనీ, 
మించాలనీ కోరుతున్నా!!
**************************************


కామెంట్‌లు
Joshi Madhusudana Sharma చెప్పారు…
మంచి కవిత. అభినందనలు 👏👏శుభాకాంక్షలు సార్ 🙏