సుప్రభాత కవిత ; -బృంద
మౌనంగా  ఎదురుచూస్తున్న...
మనసుతీరా కోరుకుంటున్న.
మమత నిండిన మాటల్లే..
చెలిమి తెలిపే స్పర్శల్లే.....

కథలు మారే కాలమల్లే
వెతలు తీరే తరుణమల్లే
కలతలన్నీ కరిగిపోయే
కరుణ నిండిన కటాక్షమల్లే....

కంటి తడిలో కమ్మగా
విరబూసే కలువల 
మెరుపులు తెచ్చే
అపురూపమైన వరంలా..

పోరాడి అలసిన మదికి
ఆరాటం తీరేలా
మూగమనసు చేసుకుంటున్న
మౌన మంత్రాక్షర ప్రభావంలా

చిన్ని గుండెలో చిరుదీపం కోసం
ఎన్నో కరుణా కెరటాలు
అన్ని అడ్డంకులూ కొట్టుకుపోయేలా
వెల్లువలా వచ్చి కాపాడే

వెలుగుల వేకువకు

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు