బుద్ధుని మహా పరి నిర్వాణం ;- చిరసాని శైలూషి,నెల్లూరు.

 తథాగతుడు అత్యున్నతమైన పరిపూర్ణమైన సంబోధిని పొందినప్పుడు భూమి కoపిస్తుంది ఇది ఐదో కారణం అలాగే తథాగతుడు ఎప్పుడు జీవనాన్ని చాలించాలనుకునే నిర్ణయాన్ని ప్రకటిస్తాడో అప్పుడు భూమి కనిపిస్తోంది ఇది ఆరవ కారణం తధాగతుడు ఎప్పుడు పునర్భవం లేని మహా పరి నిర్వాణం చెందుతాడో అప్పుడు కూడా భూమి కనిపిస్తుంది ఇది భూమి కనిపించడానికి ఏడవ కారణము ఆనందా ఒకప్పుడు ఉరువేల లో నిరంజరా నది తీరాన రావిచెట్టు కింద నేను సంబోధిని పొందినప్పుడు మారుడు నన్ను సమీపించి సమ్యక్ సంబుద్ధుడు పరి నిర్వాణం చెందు గాక అని కోరిన సంగతిని గుర్తు చేస్తూ తనకు మారునికి జరిగిన సంభాషణ మొత్తం ఆనందునికి వివరించాడు.ఇంకా ఆనందా ఈరోజు తథాగతుడు స్మృతితో ఎరుకతో జీవించాలనే కోరికను జయించాడు అని చెప్పాడు అప్పుడు ఆనందుడు మానవులు దేవతలు అందరి మంచి సుఖాల కోసం శ్రేయస్సు కోసం ప్రపంచం మీద అనుకంపతో వంద సంవత్సరాలు పాటు అయినా జీవించమని ప్రాదేయపడ్డాడు ఆనందా ఇక చాలు తథాగతుని ఇలా కోరే సమయం మించిపోయింది ఇక అలా వేడుకోవద్దు అన్నాడు బుద్ధుడు  రెండవసారి వేడుకున్న ఆనందునికి బుద్ధుడు అదే సమాధానమిచ్చాడు మూడోసారి అడిగిన ఆనందునితో బుద్ధుడు ఆనందా నీకు తథాగతుడు సంబోధిని పొందిన విషయంలో విశ్వాసం ఉందా అని అడిగాడు  అవును భగవాన్ ఉంది అని బదులు ఇచ్చాడు అనందుడు.మరి అలాంటప్పుడు నీవు మూడోసారి తధాగతుడు ఎందుకు ఒత్తిడి చేస్తున్నావు ఆనందా అన్నాడు బుద్ధుడు భగవాన్ నేను మీ పెదవుల నుండి వెలువడిన మాటలను విన్నాను మీరే ఎవరైతే నాలుగు ఇద్ది పాదాలను అలవర్చుకొని వాటిని భూమికలుగా చేసుకొని అభ్యాసంతో తమవిగా చేసుకుంటారో వారు కావాలనుకుంటే ఒక కల్పం పాటు లేదా ఇంకా ఎక్కువ కాలం జీవించగలుగుతారు అని చెప్పారు అందుకని అడిగాను భగవాను అన్నాడు ఆనందా నీకు తథాగతుని పట్ల విశ్వాసం ఉందా అని అడిగాడు బుద్ధుడు ఉంది అని సమాధానం చెప్పాడు భగవాన్  అన్నాడు ఆనందుడు అయితే ఆనందా పొరపాటు నీదే  దేవతలు. ధమ్మాని గురించి బుద్ధుడు గురించి నీకు ఇంకా ఎంత వివరంగా చెప్పినా నీకు సరిగా అర్థం చేసుకున్నట్లు లేదు  అర్థం చేసుకుంటే నీవు తథాగతుని ఇలా ఇంకా జీవించమని అడిగే వాడివి కాదు అన్నాడు బుద్ధుడు.
============================
సమన్వయం ; డా. . నీలం స్వాతి 
కామెంట్‌లు