ఈవేళ ఎందుకో?;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పూలు
వికసించటంలా
పరిమళాలు
వెదజల్లటంలా

జాబిల్లి
కనబడటంలా
వెన్నెల
కురియటంలా

గళము
విప్పుకోవటంలా
గీతము
వెలువడటంలా

పలుకులు
బయటకురావటంలా
తేనెచుక్కలు
చిందటంలా

అడుగులు
పడటంలా
నడక
సాగటంలా

అక్షరాలు
అందటంలా
పదాలు
పారటంలా

ఊహలు
తట్టటంలా
భావాలు
పుట్టటంలా

కలము
కదలటంలా
కవితలు
కూడటంలా


కామెంట్‌లు