మనం పుట్టడంతోనే యముడు తన వద్దకు తీసుకుపోవడానికి ఓ తేదీ నిర్ణయించుకుంటాడు. ఆ రోజు తాననుకున్నట్లే తీసుకుపోతాడు అని అంటుంటారు. శిల్పికి కూడా యముడు ఓ తేదీ నిర్ణయించాడు. ఆ తేదీ శిల్పికి ఎలాగో తెలిసిపోయింది. కానీ శిల్పికేమీ ఆ తేదీన మరణించడం ఇష్టం లేదు. యముడు ఒక్కసారే తనతో తీసుకుపోయే తాడుని విసురుతాడు. అది ఒకవేళ గురి తప్పితే అతను మళ్ళీ తాడు విసిరి తనతో తీసుకుపోయే అధికారం అతనికి లేదు. ఇది కూడా ఆ శిల్పికి తెలుసు.
అందుకోసం దానిని ఉపయోగించుకోవాలనుకున్నాడు శిల్పి. అందుకోసం ఓ పన్నాగం పన్నాడు. అచను అచ్చం తనలాంటి రూపాలు రెండింటిని చెక్కాడు. యముడు ఫలానా తేదీకి వస్తున్నాడని పసి కట్టిన శిల్పి ఆ రెండు శిల్పాలను నేల మీద పడుకోబెట్టి తాను వాటి మధ్య పడుకున్నట్లు కళ్ళు మూసుకున్నాడు. యముడు తన మహిషాన్ని అధిరోహించి తన పాశం చేత పట్టుకుని శిల్పి వద్దకు రానే వచ్చాడు. విస్తుపోయాడు. మూడు విగ్రగాసేవా లేక రెండేనా అని ఆలోచనలో పడ్డాడు. కానీ ఏవి శిల్పాలు, ఎవరు శిల్పి అనేది యముడు కనిపెట్టలేకపోయాడు. అంత వాస్తవంగా ఉన్నాయి శిల్పాలు. కాలం పరిగెడుతూనే ఉంది. ఆలోచించాడు ఏం చేయాలని. ఇంతలో ఆలోచన తళుక్కుమంది.
యముడు పెద్దగా అరిచాడు....
అరెరె, ఎంత గొప్పగా ఉన్నాయో శిల్పాలు. వీటిని చెక్కిన శిల్పిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను. నేనే ఏది శిలో ఎవరు శిల్పియో కనుక్కోలేకపోతున్నాను. నేల మీద పడుకున్న మూడింటిని తదేకంగా చూశాడు. అతను అనుకున్నది జరిగింది. రెండు విగ్రహాలకు మధ్య ఉన్న శిల్పి పెదవులపై సన్నని నవ్వు కనిపించింది. ఆ నవ్వుకు కారణం తాను చెక్కిన శిల్పాలు యముడినే ఆశ్చర్యపరిచాయి కదా అని అనుకోవడం. దాంతో శిల్పిలో ఓ చిన్నపాటి గర్వం. అంతే ఆలస్యం చేయకుండా ఆ క్షణమే తనదగ్గరున్న పాశాన్ని విసిరాడు.
శిల్పిని పట్టించింది ఏది...అహంకారం. గర్వం. ఇదే తీరు పలువురికుంది. పలువురి సమస్యలకు. మానసిక అశాంతికి కారణం నేనే గొప్ప నేనే పెద్దోడిని నాకే అన్నీ తెలుసు అనే అహంకారపూరిత ఆలోచనే. వీటిని వదులుకుంటేనే విజయం మనదవుతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి