శ్రావణమందించుసంబరాలు;- డా. అరుణ కోదాటి
 తొలకరి  చిరుజల్లులతో   
అప్పటివరకు   వేసవి  తాపానికి   బీటలు  వారిన నేలమ్మ చినుకుల చిరు జల్లులకు  మురిసి 
కమ్మని  మట్టివాసనతో  పరిమళమందించెను.

 ఆషాడమాసం లో   కొత్తజంట,
విరహవేదనను మరిచి   శ్రావణములో ఆనందముగా  పరవ శించెను.
 కొత్తకోడలికి  శ్రావణ పట్టి పెట్టి 
మంగళ సౌభాగ్యములందించే  
శ్రావణ  మంగళవారము నోమును  
పట్టించి, మంగళ గౌరిపూజలు  చేయించి అత్తగారు  మురిసిపోయే.

 ముత్తయిదువులందరూ శ్రావణ శుక్రవారం  ఎప్పుడొస్తుందా, అని  ఆశగా  ఎదురుచూడసాగె!
శ్రావణ మాసంలో  రెండవ శుక్రవారం రాగానే  అతివలందరూ  చేరి  లక్ష్మీదేవిని  పూజించి  సౌభాగ్యలిమ్మని  కోరిరి.

  శత్రు, గ్రహ దోషాలు  నుండి  విముక్తి  చేసే నాగ దేవతను  పూజించి  ఉపవాసములతో  నాగ పంచమి, రోజు పూజించి  చవితి  రోజు  ఉపవాస విరమణ  చేసేదరు.
 ఆగస్టు  15  స్వాతంత్ర్య  దినోత్సవం 
  దేశమంతా  అంగరంగ  సంబరమాయే!

 అన్నదమ్ముల ఆప్యాయత 
అక్కాచెల్లెళ్ళ, అనురాగబంధముతో  అందరూ  ఒకచోట చేరి  అన్నదమ్ములకు ఆడపడుచుల రక్షణగా  రాఖీ కట్టగా   అన్నదమ్ములు  సంతోషముగా  వారికి   కనుకలందిoచెదరు.

 గోపాల కృష్ణుని  పుట్టినరోజు  కృష్ణాష్టమి  నాడు  బుల్లి బుల్లి అడుగులు  ముగ్గుతో  వేసి,
చిన్ని చిన్ని  బుజ్జాయిలకు   కృష్ణుడి  వేషం  వేసి  వారిలో  కృష్ణుని చూసి  మురిసిపోతూ, 
కృష్ణుని  వేడుకలు  చేసేదరు.

ఏదేమైనా  శ్రావణ మాసమoతా  పండుగలతో, పిండి వoటలతో , పూజలతో, సందడే  సందడి. 
అనందపు నవ్వుల  సవ్వడులే!

              

కామెంట్‌లు