వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి.
 నీ బాధలను నీలోనే దాచుకోవాలి  అమ్మకు భార్యకు తప్ప ఎవరికీ చెప్పుకోకూడదు  ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు  అది ఎవరి ద్వారా వచ్చిందో వారితోనే  స్నేహపూర్వకంగా మాట్లాడితే అసలు విషయం తెలుస్తుంది  దాని పూర్వాపరాలు తెలుసుకుంటే  ఆ తప్పును సరి చేసుకునే అవకాశం ఉంటుంది  ఎక్కువగా ఆలోచించి మెదడును  ఎక్కువ మాటలతో నింపవద్దు  అయితే ఎప్పుడు  బద్ధకానికి జీవితంలో చోటు ఇవ్వవద్దు  ప్రతిక్షణం ఏదో ఒకటి చేస్తూ ఉంటే శరీరం మొత్తం ఎంతో  హుషారుగా ఉంటుంది  నీ వేదైనా పని చేయదలుచుకున్నప్పుడు నానుస్తూ చేయకు  వేగంగా పూర్తి చెయ్  అది నీకు స్ఫూర్తి ని ఇస్తుంది ఎదుటివారికి  తృప్తిని ఇస్తుంది.చేతిలో ఫోను ఉన్నది కదా అని 24 గంటలు దాని మీదే కూర్చోవద్దు  అవసరానికి మాత్రమే ఫోన్ చేయడం  అవతలివాడు ఫోన్ చేసినప్పుడు దానికి సమాధానం చెప్పడం తప్ప  మిగిలిన వాటిపై దృష్టిని కేంద్రీకరించవద్దు  దానివల్ల ఎన్నో  మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది  సమయం దొరికినప్పుడల్లా నీవు ఏదో ఒక పుస్తకం నీకు నచ్చినది  కనీసం ఐదు పది పేజీలకు తక్కువ లేకుండా చదువుతూ ఉంటే  మనసు తేలిగ్గా ఉంటుంది కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి ఈ చదివేటప్పుడు కూడా  ప్రస్తుత పరిస్థితులు ఏమిటి  నైతికంగా రాజకీయంగా  మానసికంగా ఎలాంటి మార్పులు వస్తున్నాయి అన్న విషయం పక్కాగా తెలుస్తుంది.అనవసరంగా ఖాళీగా ఉంటే అనేకమంది వారి పనులను నీకు అంటగట్టే అవకాశం ఉంది కనుక  వారికి అందుబాటులో ఉండవద్దు  జీవితంలో అన్నిoటికన్నా  ముఖ్యం ఆరోగ్యం  ఏవైనా మాత్రలు గాని టానిక్ కానీ తీసుకోవలసిన ఆ సమయానికి తప్పకుండా దానిని తీసుకోవాలి  కొంతమంది 24 గంటలు ఏదో ఒకటి తినడానికి ప్రయత్నం చేస్తారు  అలా చేయడం వల్ల శరీరంలో  కొవ్వు పదార్థం ఎక్కువగా తయారై  మరణానికి దారి తీయవచ్చు  తీపి పదార్థాలను కానీ కార్డ్స్ కానీ ఎక్కువగా తినవద్దు  ఎన్ని పనులు ఉన్నా  ప్రతిరోజు ఏ సమయాన్ని నీవు నిర్ణయించుకుంటావో ఆ సమయానికి భోజనాన్ని  చెయ్  నిద్రలో  మాత్రం జాగ్రత్తగా వుండు  నిత్యం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు తప్పకుండా నిద్రించాలి  దానిని   పాటించు.
==========================================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు