గాలి
హేమంతానికి సీమంతం చేస్తోంది
మేఘం
వర్షించడంకోసం
గ్రీష్మంతో ఘర్షిస్తోంది
మన్మధుడు
గాలితెమ్మెరలమీద కదిలొస్తుంటే
కొమ్మలు కదిలి పూలు జల్లుతున్నాయి
వసంతం అంటేనే విరహం
మీన వాహనం మీద
మన్మధుడొచ్చి బాణాలేసి వెళ్ళగానే
అగ్ని దేవుడు
మేష వాహనం మీద తయారు
అందుకే
వసంతం తరువాత గ్రీష్మమే
ఇక గ్రీష్మం తరువాత వర్షం
వర్షం తరువాత హేమంతం
ఇలా
ప్రేయసీ ప్రియుల
సంయోగ వియోగాలు
లోక కల్యాణార్థమే కదూ!!
****************************************
లోకకల్యాణం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి