శివానందలహరి;- కొప్పరపు తాయారు

 శ్లో!! 1) కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం  నిజ తపః !
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే 
శివాభ్యా మస్తోక త్రిభువన శివభ్యాం హృది పున
ర్భవాభ్యామానందస్పురదనుభవాభ్యాం నతి రియమ్ !!
భావం: శివా! శ్రీవిద్యా స్వరూపులును, చంద్రరేఖలు సిగలపై అలంకరించుకొనిన వారు నూ , ఇరువురూ తపస్సులకు ఫలితములు గాఏర్పడిన వారును, భక్తుల కోరికలు నెరవేర్చువారును, ముల్లోకములకూ అధికమైన క్షేమ కారణంగా ఉండు వారునూ, ధ్యానము చేయు వారి హృదయమున మరల మరల సాక్షాత్కార మగువారునూ, ఆనందముతో పాటు కలుగు అనుభవ రూపులను అయినా పార్వతీ పరమేశ్వరులకు ఇదే నా నమస్కారము. 
                 *****

కామెంట్‌లు