దిక్కు తోచని స్థితిలో
అల్లాడి పోతోంది
భారత దేశ0..!
దిక్సూచి లా గాంధి !!
*****
సత్యము - అహింస లే
ఆయుధాలు
జన సైన్య0తో సత్యాగ్రహం
స్వాతంత్ర్య సిద్ది !
******
రాముడు, కృష్ణుడు...
ద్వాపర , త్రేతాయుగాలకి
కలియుగానికి...
.... గాంధీ తాత!
********
నరుడై పుట్టి
మానవునిగా ఎదిగి
మహాత్ముడైనాడు
మన జాతి పిత !
*****
సగము బట్ట లేదు
సామాన్యుడు,ఫకీరు
తాతాతడు....
స్వతంత్ర దాతైనాడు !
*****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి