వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి.
 నీ గురించి ఎవరైనా ఏవైనా అనుకుంటున్నారా  వారు అలా అంటున్నారు వీరు  ఇలా అంటున్నారు అని ఎవరైనా పితూరీలు చెబుతున్నారా  వాటిని వినవద్దు  లెక్క చేయవద్దు  ఎవరు ఎలా ఆలోచించుకోవాలి నీవు మంచి చేయదలచుకున్నది చేసి తీరు  మనం ఏదైనా పని చేసేటప్పుడు అవతలి వారి అభినందనలు పొందడానికి  లేదా మరేదో ఆశించి చేయవద్దు  ఎప్పుడు ప్రతిఫలం ఆశించకుండానే సహాయం చేయాలి  లేదు దాని జోలికి వెళ్ళనవసరం లేదు  ఎవరైనా సరే దగ్గర వారు కానీ దూరమైన వారు కానీ అడగకుండా మాత్రం సహకరించవద్దు, సాయం చేయవద్దు  అలా చేయడం వల్ల కొన్ని సందర్భాలలో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది  ఆ అవకాశాన్ని మాత్రం ఇవ్వవద్దు.కొంతమందికి  ఉచిత సలహాలు ఇచ్చే అలవాటు ఉంటుంది  వారు అడిగినప్పుడు ఆ సమస్య ఏమిటో తెలుసుకుని దానిని పరిష్కరించడానికి సరైన సూచనలు చేయి  జీవితంలో చేయకూడని మొట్టమొదటి పని ఇతరులకు అప్పు ఇవ్వడం ఇతర నుంచి అప్పు తీసుకోవడం  దీనివల్ల సమాజంలో చీకాకులు వస్తాయి చెడ్డ పేరు వస్తుంది  జేబులో డబ్బులు ఉంటే ఆ డబ్బులు ఖర్చు చేసే అంతవరకు నిద్ర పట్టదు కొంతమందికి  నిజమైన అవసరం అయ్యేదేమిటో దానికోసం మాత్రమే మనం ఖర్చు చేయాలి  బజారుకు వెళ్లాను కదా అని ఏదో హోటల్లో చిరు తిండి తినడం కాఫీలు తాగడం చేయడం వల్ల ముందు నీ ఆరోగ్యం  చెడిపోతుంది అన్న విషయాన్ని గ్రహించు ఇంటి భోజనానికి మించిన భోజనం ఎక్కడ దొరకదు.నీ దగ్గర ఎవరైనా పని చేసినప్పుడు దానికి తగిన ప్రతిఫలం ఆ క్షణంలోనే ఇచ్చాయి  ఎవరైనా ఉచితంగా ఏదైనా ఇచ్చిన దానిని తీసుకోవడానికి ప్రయత్నం చేయవద్దు  ఉద్యోగాలు చేస్తున్నవారు అక్కడ జరిగిన విశేషాలను  ఇంట్లో భార్యా పిల్లలకు చెప్పి వారిని కూడా ఇబ్బంది పెట్టడం బాధ పెట్టడం జరుగుతూ ఉంటుంది  కార్యాలయంలో జరిగిన ఏ విషయాన్ని ఇంటి వరకు తీసుకురాకూడదు అన్న విషయం మరవకు  ఏ రోజు ఏ కార్యక్రమాలు చేయాలో ఆ ముందు రోజునే నీవు  ఒక ప్రణాళికను తయారు చేసుకుంటే  జీవితం ప్రశాంతంగా ఉంటుంది  ఈరోజు మొత్తం నువ్వు ఏం చేసావో రాత్రి నిద్రించే ముందు నిన్ను నీవు  ఆలోచించుకుంటే ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది మంచిని మాత్రమే చేసి చెడును వదిలి  సుఖంగా ఉండడానికి కాకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు.
==============================================
సమన్వయం ; డా. నీలం స్వాతి

 
కామెంట్‌లు