శీవానందలహరి; - కొప్పరపు తాయారు.

 శ్లో : మనస్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్ర ఫణితౌ
       పరాభ్యశ్చ
      కరశ్చాభ్య ర్చాయాం శృతి రపి కథా కర్ణనవిధౌ
      తవ ధ్యానే బుద్ధి ర్నయన యుగళం
      మూర్తివిభవే
    పర గ్రంథా న్కైర్యా పరమ శివ జానే పరమతః !

భావం: 
ఓ పరమ శివా! నా మనసు నీ పాద పద్మముల 
యందు , నా గొంతు నీ స్తోత్రములు పారాయణ 
చేయుటకు, నా హస్తములు నిన్ను పూజించుటకు, 
కర్ణములు నీ కథలు వినుటకు, బుద్ధి నిన్ను ధ్యానించుటకు, కన్నులు నీ దివ్య మంగళ స్వరూపమును చూచుటకును, ఇష్టముగా ఉన్నవి. నేను ఇంకా వేటితో వేరే గ్రంథములు తెలుసుకోగలను. ఆ గ్రంథములలో కూడా నీ తత్వమే ఉండును కదా! కావున ఇతర గ్రంథములను చదివి ఏమి సాధించను. 
                ****

కామెంట్‌లు