సుప్రభాత కవిత; - బృంద
అలసిన మనసుకు దొరికిన
అరుదైన ఆసరాలా...

ఆదరించి  అక్కున చేర్చుకునే 
అమ్మ మనసులా..

అంతరంగం అర్థం చేసుకునె 
ఆప్తమిత్రునిలా..

మబ్బు మూసిన మనసు వాకిట
వెలసిన మమతల ముగ్గులా..

అరలో దాచి తెరలు వేసిన
అందమైన అనుభూతిలా..

మది అడుగున మంచులా పేరిన
మమకారంలా..

పెదవి అంచున దాగిన
పరవశపు నవ్వులా..

కంటి కొలకున నిలిచిన
ఆనంద బాష్పంలా..

పండు ముత్తయిదువ నుదుట
ప్రకాశించే కుంకుమలా..

గగనాన కనక కలశం 
ఒలికించిన కాంతి పుంజంలా..

అద్భుతం చూసిన అనిర్వచనీయమైన
ఆనందంలా.. 

వేంచేసిన వేకువకు

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు