తక్షణమే......! -కోరాడ నరసింహా రావు
జరుగుతున్న అ కృ త్యా లు... 
 అఘాయిత్యాలు , మానభంగాలు , హత్యలకు... 
  విల - విల లాడిఆవేదనతో తల్లడిల్లిపోయి...ఆక్రోషి0చినమనసు! 
 స్పందనలను కోల్పోయి నిశ్చేష్టమై పోయింది...!!

ఇంత ఘోరం జరిగినా....
 ఏమి అనుకుంటే మాత్ర0 ... 
  ప్రయోజన మేమిటని ... 
   ఎన్ని గొంతులు విరుచుకు పడినా... ఎంతగా నిరసనలు వినిపించినా... ఒరుగుతున్న దేమిటని మనసు మూగగా... 
ప్రశ్నిస్తోంది !! 
   న్యాయం - చట్టం చేతులు ముడుచుకు కూ చుం టే.... 
 జనమెంత గోలచేసినా యింతే 

మనుషుల్లో ఇంతగా పైసాచికం ప్రబలి పోటానికి దారి తీసినపరిస్తితు లేమిటో , నివారణ ఎలాగో మేధావులూ...ఆలోచించండి.! 

ఆనాటి రాతి యుగంలోనే కాదు... త్రేతాయుగ , ద్వాపరయుగాలలో నైనా,కనీ  వినీ ఎరుగని రాక్షసత్వము... ఈ రాకెట్ యుగము లోనా...!? 

వానరుల నుండి నరులుగా మారి... మానవుల మైనామను కుంటున్నాము.... 
  రాక్షసులు, పిసాచులకంటే క్రూ రంగా తాయారవుతా మనుకో లేదు...!! 

ఈ జాడ్యం సమాజానికి సోకిన కాన్సర్... భయంకరమైన కాన్సర్...!! వెంటనే తగిన శస్త్ర చికిత్సతో సమ్మూలంగా తొలగించకపోతె... 
 మొత్తం సమాజమే నాశనమై పోతుంది...!! 
 మానవమేధావులారా
మేల్కొండి...! 
  చట్టమా... త్వర పడు... 
  న్యాయమా తత్క్షణమే స్పందించు .... 
   భవిష్యత్తులో ఇ లాం టి వి
 పునరావృతం కాకుండా చూడండి ప్లీ..జ్............ !! 
    *******

కామెంట్‌లు