ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన ఆత్మకూరు యువకుడు
 జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన వాకిటి కుమార్  ముదిరాజ్
రక్తదాతను అభినందించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సభ్యులు
       నేడు వనపర్తి జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరంలో స్టేట్ ర్యాంక్ ప్రతిభ కనబరిచి ప్రస్తుతం ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న ఆత్మకూర్ ప్రాంతంలోని తెలుగు గేరికి చెందిన వాకిటి కుమార్ ముదిరాజ్ నేడు తన జన్మదిన సందర్భంగా స్వచ్ఛందంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నేడు రక్త దానం చేయడం జరిగింది. 
     వాకిటి కుమార్ ముదిరాజ్ రక్తదానం చేయడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమంలో కూడా చురుకుగా పాల్గొంటూ  చదువుల్లోనూ,సామాజిక సేవలోను చురుకుగా పాల్గొంటూ అందరి చేత పట్టణంలో ప్రశంసలు పొందుతున్నాడు. స్వచ్ఛందంగా రక్తదానం చేసిన కుమారును ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సభ్యులు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సభ్యులు ప్రముఖ సామాజిక సేవకులు డాక్టర్ మురళీధర్ సార్ గారు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ సాగర్, సహాయ కార్యదర్శి గున్నూరు యాదగిరి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి తెలుగు తిరుమలేష్,జిల్లా సభ్యులు శ్యామ్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ల్యాబ్ టెక్నీషియన్ ,రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 
       ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వాకిటి కుమార్ ముదిరాజ్ సేవా గుణానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

కామెంట్‌లు