జిల్లా స్వాతంత్ర్య దినోత్సవ పెరేడ్ లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్

 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుతేది: 15-08-2024 రోజున జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్ , కరీంనగర్ లో ఘనంగా జరిగాయి.రాష్ట్ర ఐటి & అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు జాతీయ  పతాకావిష్కరణ చేసి వేడుకలను ప్రారంభించారు.ఈ వేడుకల్లో పోలీస్ వారి గన్ పెరేడ్ మరియు వందన స్వీకారం అనంతరం మంత్రి గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని గురించి ఉపన్యసించారు.ఈ వేడుకల్లో పోలీస్,ఎన్ సి.సి.వారితో పాటు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు 25 మంది పాల్గొన్నారు.ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా అధికారులు శ్రీ కంకణాల రాంరెడ్డి, అడిగొప్పుల సదయ్య,కె ఇ శ్రావణ్ కుమార్,గణేశ్ సింగ్ తాకుర్,ఇందిర,స్వప్న,మౌనిక మరియు స్కౌట్ మాస్టర్ రవీందర్,గైడ్ కేప్టన్లు శోభ,రజిత,అనిత మొదలైన వారు పాల్గొనడం జరిగింది.ఈ వేడుకల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వజ్రోత్సవ లోగోను జిల్లా చీఫ్ కమిషనర్ , విద్యాశాఖాధికారి శ్రీ జనార్ధన రావు గారు ఆవిష్కరించారు.చక్కని ప్రతిభను కనపరిచిన విద్యార్థులనందరిని మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రశంసాపత్రాలతో అభినందించారు.


కామెంట్‌లు