ఆదర్శం- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 అన్నాదమ్ములు అక్కాచెల్లెళ్ళు 
పడుగుపేకల్లా ఈభువిపై
మధుర బంధంగా అల్లుకోవడం
ఒక అద్భుతం
ఏకోదరులైనా కాకున్నా 
సోదరసోదరీ భావన
సౌహార్ద్ర సౌగంధికమే
అందరి జీవితాన మధురాతి మధురం 
ఒకరికొకరు తోడుగా 
కష్టసుఖాల్లో పాలుపంచుకుని
వాటికి సరియైన అవగాహనతో
కారణాలను అన్వేషించి 
జాగ్రత్తలు చెప్పుకోవడం 
ఈ జగత్తులో కేవలం 
సోదరసోదరీమణులకే అవకాశం ఉంది 
రక్షాబంధనమే మధురబంధనంగా
శ్రావణపూర్ణిమ నాడు 
వాత్సల్యపూరిత పూర్ణరక్షణ బంధంగా 
మార్చడానికే ఏర్పడింది
అలనాటి సురలు
మహాలక్ష్మి చంద్రులు
నారాయణీ నారాయణులు
ద్రౌపతీ శ్రీకృష్ణులు
మనందరికీ ఆదర్శం కదా
వారి బాటలో నడిచి
ఆ మధుర బంధం కోసం
పాటుపడదామా మరి!!
—---------------------------------------------------


కామెంట్‌లు
Ramakrishna Patnaik చెప్పారు…
అభినందనలు! డాక్టర్ గౌరవరాజు సతీష్ కుమార్ మాష్టారుకు!
--రామతాత.
Ramakrishna Patnaik చెప్పారు…
అభినందనలు! డాక్టర్ గౌరవరాజు సతీష్ కుమార్ మాష్టారుకు!
-రామతాత.