న్యాయాలు -597
పిత్రనుసృత స్తనంధయ న్యాయము
****
పిత్ర అనగా తండ్రి.అనుసృత అనగా అనుసరణము,అనుసరించుట.స్తనంధయ అనగా పసివాడు.
తండ్రిని అనుసరించిన పసి బాలుని వలె.తత్త్వవేత్తను అనుసరించిన వ్యక్తి తత్త్వవేత్తచే ఉద్ధరింప బడును అని అర్థము.
బాలుడు తనను కొట్టినను,తిట్టినను తండ్రి కోపగించక అతడిని లాలిస్తూ, ప్రేమిస్తూనే వుంటాడు. అలాగే అజ్ఞులు దూషించినా, భూషించినా ఎలాంటి వికారమును పొందక జ్ఞాని వారలకు తగురీతి జ్ఞానోపదేశం చేస్తాడు అనే అర్థముతో ఈ న్యాయము చెప్పబడింది.
ఇక పిల్లల విషయానికి వద్దాం.బాలుడు,బాలిక ఇద్దరిపై తండ్రి యొక్క ప్రభావం ఎంతైనా ఉంటుంది.ఊహ తెలిసినప్పటి నుంచీ తల్లితో పాటు తండ్రిని కూడా నిశితంగా గమనిస్తూ వుంటారు.ప్రేమ పూరిత చనువిచ్చే తండ్రికి బాగా దగ్గరవుతూ ఉంటారు.తండ్రి కొట్టినా, తిట్టినా పిల్లలు మనసులో పెట్టుకోరు.అలాగే తండ్రి కూడా పసితనంలో పిల్లలు ఎంత అల్లరి చేసినా,తెలిసీ తెలీక తండ్రిపై చెయ్యెత్తినా, ఏవేవో మాట్లాడినా వాటిని పరిగణనలోకి తీసుకోకుండా వారికి నయానా భయానా చెబుతూ మంచి నడవడిక రూపొందేలా చేస్తాడు.
అయితే ఈ సందర్భంగా తండ్రి తన కొడుకును బాల్య యౌవన కౌమార దశలలో ఏ విధంగా తీర్చి దిద్దాలో కౌటిల్యుడి నీతి శాస్త్రములో చాణక్యుడు చెప్పిన ఓ గొప్ప శ్లోకాన్ని చూద్దాం.
" లాలయేత్ పంచ వర్షాణి,దశ వర్షాణి తాడయేత్!/ ప్రాప్తేతు షోడశే వర్షే, పుత్రం మిత్ర వదాచ రేత్!!"
అనగా కుమారుడికి ఐదు సంవత్సరాలు వచ్చే వరకు లాలించాలి, ప్రేమతో చూడాలి.వాత్సల్యాన్ని చూపించాలి.ముద్దు చేయాలి.ఆ తర్వాత పది సంవత్సరాల వయసంటే పిల్లవాడిది ఎదుగుతున్న వయసు కాబట్టి చుట్టూ ఉన్న పరిసరాల నుంచి, ఇరుగు పొరుగు వారి నుండి, స్నేహితుల నుండి అనేక విషయాలను గ్రహిస్తూ అవగాహన చేసుకుంటాడు. ఈ కౌమార దశలో మంచి, చెడు...ఈ రెండింటి ప్రభావం బాలుని మనసుపై స్పష్టమైన ముద్రలు వేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ వయసులోనే తండ్రి ఎంతో విజ్ఞతతో తగు జాగ్రత్తలు తీసుకుంటూ పదిహేను సంవత్సరాలు నిండే వరకూ ఒక కంట కనిపెడుతూ వుండాలి.
ఈ అతి సున్నితమైన దశలో మంచి మార్గంలో నడిపించేందుకు, విపరీతమైన భావోద్వేగాలకు లోను కాకుండా ఉండేందుకు అవసరమైతే దండించడానికి కూడా వెనుకాడ కూడదని అంటాడు చాణక్యుడు.
ఇక పదహారు సంవత్సరాల వయస్సు వచ్చినప్పటి నుండి హితము కోరే మంచి స్నేహితుడిగా మసలుకోవాలి.ఆ వయసులో తన జీవిత అనుభవాలను రంగరించి, నైతిక విలువలు అంటే ఏమిటో తెలుసుకునేలా బాలునిలో చక్కని వ్యక్తిత్వం రూపుదిద్దుకునేలా చూడాలి. అతడి బంగారు భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే హితైషిగా వుండాలి. ఇలా ఉన్నప్పుడే మంచి తరాన్ని సమాజానికి అందివ్వగలం.
ఇదే పద్ధతి పాఠశాలల్లో గురు శిష్యులకు కూడా వర్తిస్తుంది. ఆకతాయి,అల్లరి పిల్లల పట్ల ఎంతో సహనంతో వ్యవహరించి వారిని సరైన మార్గంలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఈ పద్ధతిని అనుసరించి కొందరు జ్ఞానులు, సంస్కర్తలు సమాజాన్ని, వ్యక్తులను మార్చేందుకు ప్రయత్నిస్తుంటారు.
"ఇదండీ"పిత్రనుసృత స్తనంధయ న్యాయము" లోని అంతరార్థము.
బాధ్యతాయుతమైన, మానవీయ విలువల పౌరులను తీర్చిదిద్దాలంటే ముందు కుటుంబం నుండే మొదలవ్వాలి.అది కూడా తండ్రి నుండే మొదలవ్వాలి.అప్పుడే ఓ నైతిక, మానవీయ సమాజం కళ్ళముందు ఆవిష్కృతమవుతుంది. ఏకీభవిస్తారు కదూ!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి