నేటి భారతం....! - .....కోరాడ నరసింహా రావు.
సిరి , సంపదలతో...జ్ఞాన,విజ్ఞా నభూమిగా అలారారింది...ఆ  నాటి, ఒక నాటి భారతం...! 
  
అంతః కలహాలు...పారిన శత్రు వులపన్నాగాలు.,పరపీడనలో
శతాబ్దాలు ...! 
అలమటించిన చేదు అను భవాలు యింకా స్మృతిపధం నుండి మరుగు పడనే లేదు...!! 

అనేక పోరాటాలు, ప్రాణ త్యాగాలు, బలిదానాలతోస్వ తంత్ర మైతే వచ్చింది, గానీ... 
 స్వరాజ్య స్థాపనలో ఎన్నెన్ని సవాళ్లు...!? 
  
దేశ0 రెండుగా ముక్కలై.... మత కలహాలు...! 
దారిద్ర్యం, అవిద్య...!! 
 
ఎంతశ్రమించి అభివృద్దిపదంలో
 నాలు గడుగులుముందు కెళ్ళినా..., 
  కులం, మతం, పేదా-గొప్పాతారతమ్యాలు... 
ఎనిమిదడుగులు వెనక్కు లాగు తున్నాయి...!! 

పరస్పర కక్ష సాధింపులతో
కుటిల,హత్యా రాజకీయాలు...
 సరిహద్దుల్లో పొంచివున్న ప్రమాదాలు...! 

మాదక ద్రవ్యాలు... మానభ0గాలు , హత్యలు... 
 అవినీతి - అరాచకం.. 
ప్రకృతివైపరీత్యాలు...!! 
 
ఈ ప్రతి కూల పరిస్థితులన్ని
 చుట్టుముట్టిన నేటి నాభారతదేశ0... ప్రవేసించట మేగానీ తిరిగి రావటం తెలియని అభిమన్యుడుకాదు, 
 సవ్యసాచి అర్జునుడు...! 
 ఎప్పటికీ మన దేశ0... ప్రపంచాన్ని శాసించే అద్వితీ అద్భుత శక్తిగా గుర్తింపబడి , గౌ రవింప బడుతుంది ... 
  ఇది సత్యము....!జై హింద్..!! 
    ********

కామెంట్‌లు