శ్లోః పద్మప్రియే పద్నిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి
విష్ణుప్రియే విశ్వమనోనుకూలే త్వత్పాదపద్మం మయిధత్స్వ
పవిత్రమైన శ్రావణ మాసంలో చేసుకునే వరలక్ష్మీ వ్రతం చాలా విశిష్టమైనది. స్త్రీలలోని సహజమైన వైభవాన్ని ఆవిష్కరించేది వరలక్ష్మీ వ్రతం. శ్రావణమాసంలో చేస్తున్న వరలక్ష్మీ వ్రతం కూడా కేవలం ఆమె తన కుటుంబం కోసం మాత్రమే కాదు... తను లక్ష్మీ దేవియై ఇతర ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారికి తాంబూలాది సత్కారాలను చేసి ఎదుటి స్త్రీలలో ఉన్న లక్ష్మీతత్వాన్ని ఆవిష్కరించడమే వరలక్ష్మీ వ్రతం ఉద్దేశం. ఈ వ్రతాన్ని మహిళలందరూ తప్పనిసరిగా చేసుకుంటారు. కలశ స్థాపన చేసి అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసుకుని ముత్తైదువులను పిలిచి వ్రతం ఆచరిస్తారు. ముత్తైదువులను పిలిచి సంతోషంగా మనతో పాటు వారికి కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ చేసుకుంటారు. సంపదలను ప్రసాదించే ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో... పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం చేసుకోవడం సంప్రదాయం.వరలక్ష్మీ వ్రతం మహిళలందరూ ఆచరించదగినది. శ్రద్ధాభక్తులతో ఆ తల్లిని పూజించినవారిని ఎలాంటి కొరతా లేకుండా కటాక్షిస్తుందన్నది పెద్దల మాట.చతుర్విధ పురుషార్థాలలో చివరిది మోక్షం. మోక్షాన్ని కోరుతూ లక్ష్మీదేవిని ఆశ్రయిస్తే... లౌకికమైన ప్రలోభాల నుంచి ఆధ్యాత్మికమార్గానికి మళ్ళిస్తుంది.శుక్రవారం నాడు భక్తులు ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికి ముందే తలస్నానం చేస్తారు. ఇంటిని శుభ్రం చేసి రంగోలి, కలశంతో అలంకరిస్తారు.ఉడకబెట్టిన పప్పుధాన్యాలు, చక్కెర పొంగలి, బెల్లంతో చేసిన మిఠాయిలు పంపిణీ చేస్తారు. భక్తులు శనివారం పుణ్యస్నానాలు ఆచరించి, స్నానమాచరించిన తర్వాత కలశాన్ని విసర్జిస్తారు. వరలక్ష్మీ వ్రతం ఆచరించడం వల్ల శాంతి, శ్రేయస్సు, ఆర్థిక దీవెనలు లభిస్తాయని నమ్ముతారు.శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి
లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది.భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది
లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది.భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి