కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మహారాష్ట్ర సోలాపూర్లోని తెలుగు భాషాభివృద్ధి సార్వజనిక గ్రంథాలయంలో "రాధా మధురిమలు, కాంతి కిరణాలు" అనే రెండు సాహిత్య పుస్తకాలను ఆవిష్కరించారు. ఈర్ల సమ్మయ్య 'మధురిమలు' అనే చందోబద్ధమైన నూతన తెలుగు లఘు కవితా ప్రక్రియను 6 జులై, 2020 న ప్రారభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని వందలాది మంది కవులు, రచయితలు "మధురిమలు" అనే నూతన తెలుగు లఘు కవితా ప్రక్రియలో వందలాది మంది మధురిమలు (కవితలు) రాస్తున్నారు. 2020 నుంచి తెలుగు కవులు, కవయిత్రులు, రచయితలను ప్రోత్సహిస్తూ వేలాది కవితలు రాయిస్తున్నారు. వారికి ప్రశంసా పత్రాలను అందిస్తున్నారు. "మధురిమలు" అనే కవితల ద్వారా సామాజిక చైతన్యాన్ని కలిగిస్తున్నారు. ప్రజల్లో మార్పు తీసుకొస్తున్నారు. 'మధురిమలు' సరళంగా అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో ఉండడంతో అనేక మంది కవులు, రచయితలు ఈ ప్రక్రియలో వేలాది మంది రచనలు చేస్తున్నారు. మహా రాష్టqలోని సోలాపూర్ కు చెందిన రాధాసురేష్ యర్జల్ రాసిన "రాధా మధురిమలు" పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఎమ్మిగనూరు కు చెందిన బాల సాహితీ వేత్త బాల బంధు గద్వాల సోమన్న రాసిన 'కాంతి కిరణాలు' బాల గేయాలు పుస్తకాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఈర్ల సమ్మయ్యను శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ అమ్మ భాష తెలుగుకు రోజరోజుకు ఆదరణ తగ్గుతోందని, ప్రతి ఒక్కరూ అమ్మభాషను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత, జాగిరి యాదగిరి, పుస్తక రచయిత రాధా సురేష్ యర్జల్, బాల సాహితీ వేత్త గద్వాల సోమన్న, రేణుక, పలువురు కవులు, కవయిత్రులు, రచయితలు, పలువురు పాల్గొన్నారు.
సోలాపూర్లో రెండు సాహిత్య పుస్తకాలు ఆవిష్కరించిన ఈర్ల సమ్మయ్య

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి