ఎందుకో ఏమో?;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
వేడి తగిలితేగాని
వెన్న కరగదు

కోర్కె కలిగితేగాని
మనసు చలించదు

నీటిలో దిగితేగాని
లోతు తెలియదు

అందము చూస్తేగాని
ఆనందము కలగదు

విరి విచ్చుకుంటేగాని
పరిమళము వెలువడదు

కడుపు నిండితేగాని
కుదురు మాటలురావు

మాటలు కలిస్తేగాని
బంధము ఏర్పడదు

పెదవులు విప్పితేగాని
పలుకులు బయటికిరావు

తీపి తగిలితేగాని
నోరు ఊరదు

బరువులు మోస్తేగాని
భారము తెలియదు

కష్టము చేస్తేగాని
ఫలితం లభించదు

శ్రమ పడితేగాని
లక్ష్యాలను ఛేదించలేరు

చేతులు కలిపితేగాని
చప్పట్లు వినబడవు

మనసులు ఏకమైతేగాని
ముచ్చట్లు సాగవు

వసంతమాసము వస్తేగాని
కోకిలలు గళమునువిప్పవు

వేడిగాలులు వీస్తేగాని
మల్లియలు మొగ్గలేయవు

పెళ్ళి చేసుకుంటేగాని
బంధాలవిలువ తెలియదు

మంచికవితలు వ్రాస్తేగాని
కవులకు పేరుప్రఖ్యాతులురావు

ఊహలు పుడితేగాని
కవితలు జనించవు

పాఠకులు ప్రశంసిస్తేగాని
కవులు తృప్తిచెందరు


కామెంట్‌లు