షోలాపూర్ లో సోమన్న పుస్తకావిష్కరణలు

 కర్నూలు జిల్లా,పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు  గద్వాల సోమన్న  రచించిన "53.పాల బుగ్గలు-పూల మొగ్గలు 54.కాంతి కిరణాలు" రెండు పుస్తకావిష్కరణలు ఒకే వేదికపై,తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా,తెలుగు భాషాభివృద్ధి సార్వ జనిక్ గ్రంథాలయం,షోలాపూర్ ,మహారాష్ట్రలో తెలుగు భాషాభివృద్ధి సార్వజనిక్ గ్రంథాలయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కమటం,ప్రముఖ వ్యాపారవేత్త  శ్రీ గణేష్ బుదారం,కళాకారిణి, రచయిత్రి, తెలుగు భాషాభివృద్ధి కృసీవలురు శ్రీమతి రాధా సురేష్ యర్జల్,రాష్ర్ట ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, మధురిమలు రూపకర్త శ్రీ ఈర్ల సమ్మయ్య,ప్రముఖ రచయిత శ్రీ జాగిరి యాదగిరి గారల చేతుల మీద,విచ్చేసిన ప్రముఖుల సమక్షంలో  ఘనంగా ఆవిష్కరించారు.ఈ పుస్తకాల్ని కళాపోషకులు,విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ రాజగోపాల్ దంపతులకు అంకితమివ్వడం విశేషం. పిమ్మట కృతుల కర్త గద్వాల సోమన్నను అనతి కాల వ్యవధి లో అర్థ శతాధిక పుస్తకాలు ప్రచురించినందుకు గాను, బాలసాహిత్యంలో వారి విశేష కృషికి గాను సత్కరించారు.ఇదే వేదికపై శ్రీమతి రాధా సురేష్ విరచిత "రాధా మధురిమలు" పుస్తకావిష్కరణ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతలు శ్రీమతి రేణుకా బుదారం  మరియు పాత్రికేయులు పాల్గొన్నారు.పుస్తక రచయిత,బాలసాహిత్యరత్న గద్వాల సోమన్నను అందరూ అభినందించారు.
కామెంట్‌లు