స్ఫూర్తి ప్రదాతలు 48 సేకరణ..సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

 కొద్ది రోజుల్లో దీపావళి రాబోతోంది. ఢమఢమ గుండెలదిరే విదేశీ టపాసులకన్నా పర్యావరణ పరిరక్షణ కై  ఆవుపేడ బంకమట్టితో ప్రమిదలుచేయించి గ్రామీణ స్త్రీలకు ఉపాధి కల్పించారు యు.పి.లో ఐఎఎస్ ఆఫీసర్ దుర్గా శక్తి నాగ్ పాల్! వాటిబూడిద మొక్కలకు ఎరువుగా వేస్తున్నారు. పూలను నీటి లో వేసి కలుషితం చేసేబదులు ఊదుబత్తీలుకోన్స్ తయారు చేసి ఎసెంట్ పేరు తో అమ్ముతున్నారు ధనూక రక్షిత. ఢిల్లీ కి చెందిన పూనం పూలను సేకరించి డెకరేషన్లో ఉపయోగపడే వస్తువులు  ధూపం తయారు చేస్తారు.      సీతాకోకచిలుకలపెంపకంతో అందం ఆనందం అంటున్నారు ముంబైలో ఉన్న ప్రియాంక. బాల్కనీలో ఆకుకూరలు  పూలమొక్కలతో 10ఏళ్ల లో5వేలపైగా సీతాకోకచిలుకలపెంపకంతో ఆదర్శంగా నిలిచారు. సోంపు కరేపాకు మొక్కలపై సీతాకోకచిలుక గుడ్లుపెడ్తుంది.ఇదీ చిట్కా.
47వ ఏటవారణాసి వాసి సుబుహీ నాజ్ చేపలపెంపకంతో ఏడాది కి 2సార్లు పంటతో మహిళలకు ఉపాధి కల్పించారు. అవార్డ్స్ గెలిచింది.
రోజూ 50మైళ్ళు సైకిల్ తొక్కి అమెరికన్ మహిళ క్రిస్టిన్ ఫాల్కనర్ ఒలింపిక్సు లో రెండు పతకాలు పొందింది.నరేషీమీనా రాజస్థాన్ రమణి.తలనొప్పి ఆమె జీవితంని తలక్రిందులు చేసింది.మెదడులో కణితి తోనరకం చవిచూసింది. ఐనా జాబ్ చేస్తూ సివిల్స్ కి తయారవుతోంది. అమితాబ్ బచ్చన్  బిగ్ బీ షోలో పాల్గొని కోటి రూపాయలు సంపాదించింది.
జపాన్ 94 ఏళ్ళ యసుక తమాకీ చురుగ్గా  67 ఏళ్ళ వయసులో కంప్యూటర్ నేర్చుకుంది. గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. రోజు కి 8 గంటలు పనిచేస్తున్నా రామె
5ఏళ్ల పంజాబీ పాప జియానాగార్గ్ చెస్ లో సత్తా చాటుతోంది.ఎంగెస్ట్ చెస్ ఛాంపియన్ గా నిల్చింది.🌹
కామెంట్‌లు