రుద్రమదేవితో ఐరన్ మ్యాన్ ;- డా. హారిక చెరుకుపల్లి 9000559913

(

రేపు ఓజోన్ దినోత్సవం సందర్బంగా మీకు  అవగాహన కోసం  ఒక మంచి కథ చదవండి మరి )
--------------------------------------------------------------------------------------------------------------------------
   రాహక్ ఐరన్ మ్యాన్ సూట్ వేసుకుని ఇల్లంతా తిరుగుతూ హడావిడి చేస్తున్నాడు. చేతికి వేసుకున్న గ్లోవ్ తో పిడికిలి బిగించి అక్కకు చూపిస్తున్నాడు. రాణీ రుద్రమదేవి వేషంలో ఉన్న రాహి థాంక్స్ చేతిలో చక్క కత్తి ఝళిపిస్తూ తమ్ముడితో ఆడుతోంది.ఇవాళ బళ్ళో జరగబోయే విచిత్ర వేషధారణ పోటీలకు సిద్ధమవుతున్నారు. “ నేను ఐరన్ మ్యాన్ సూపర్ హీరోని. నాకు చాలా శక్తులుంటాయి. రాణీ రుద్రమ దేవికి కత్తి ఒకటే శక్తి” అక్కను ఆటపట్టిస్తూ అన్నాడు తమ్ముడు.
“సూపర్ హీరోలు నిజంగా ఉండరు. అవన్నీ కల్పనలు. వాళ్ళ శక్తులు కూడా అంతే!రాణీ రుద్రమ నిజంగా ఉండేది. ఆమెకు శక్తి కత్తి కాదు. ఆవిడే ఒక శక్తి. బ్రిటీషు వాళ్ళను గడగడలాడించిన పోరాట యోధురాలు. ఆవిడ ముందు  ఐరన్ మాన్లు, బాట్ మాన్లు ఏ మాత్రం సరిపోరు “అంటూ తమ్ముడికి దీటుగా సమాధానం ఇచ్చింది.
           “ సూపర్ హీరోలు నిజంగా ఎందుకు ఉండరు? ఉండే ఉంటారు. మనకు తెలియనివన్నీ లేవనుకుంటే ఎలాగ! ఇప్పుడే చూపిస్తా నీకు” అంటూ గూగుల్ తెరిచాడు. నిజమైన సూపర్ హీరో కోసం వెతికాడు. అక్క ఆసక్తిగా చూస్తోంది.సూపర్ హీరో అంటే సమస్త భూమండలాన్ని రక్షించే శక్తి అని గూగుల్ చెప్పింది.
భూమిని రక్షించేదెవరని అడిగింది అక్క. “ఓజోన్ పొర” అని జవాబిచ్చింది గూగుల్. “ అయితే ఓజోన్ పొర నిజమైన సూపర్ హీరో” అన్నాడు తమ్ముడు.ఓజోన్ పొర గురించి చదవటం మొదలుపెట్టారు. “ భూమికి కొంచెం దూరంలో ఉండే ఓజోన్ వాయువు పొర సూర్యుడి నుండి వచ్చి అతినీలలోహిత కిరణాల నుండి భూమిని కాపాడుతుంది. ఆ కిరణాలు చాలా ప్రమాదకరమైనవి. ఓజోన్ వల్లనే మనకు వాటి నుండి రక్షణ. సెప్టెంబర్ 16వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా ఓజోన్ దినోత్సవం జరుపుతారట” అక్క చదువుకుంటూ వెళ్తోంది. తమ్ముడు వింటూ వింటూ ఒక్కసారిగా “ అక్కా! కింద చూడు. ఓజోన్ పొరకు చిల్లు పడిందట”అన్నాడు. “ అవును నిజమే! కాలుష్యం వలన ఓజోన్ పొరకు చిల్లు పడింది. ఫ్రిజ్, ఏసీ లు ఎక్కుగా వాడటం వలన కూడా!”ఆందోళనగా అంది అక్క.
              “సూపర్ హీరోస్ కూడా రక్షణ కావాలనమాట! మన హీరో బాగుంటేనే మనం బాగుంటాం. మనమే రక్షించుకోవాలి ” అంటూ గదిలో ఏసీ స్విచ్ ఆపేసి రుద్రమదేవితో కలిసి ఐరన్ మ్యాన్ బడికి బయలుదేరాడు. 
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
చాలా బాగున్నది.