అమ్మకు ఆది వారం సెలవిద్దాం;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497
 అమ్మకు ఆదివారం మన్న
సెలవిద్దాం
అమ్మ భూదేవి ఇద్దరు ఒకటే
భూదేవి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి పగలు రాత్రి ఏర్పడేలా చేస్తుంది
మన  అమ్మ కుటుంబం చుట్టూ
నాన్న చుట్టూ నిరంతరం తిరిగి
వారి బ్రతుకుకు, భవితకు మూల వేరు అవుతుంది
అమ్మ మన లాంటి మనిషే కదా 
అమ్మ యంత్రం కాదు గదా
మన ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడిన అమ్మను 
మన కనుపాపగా చూసుకుందాం
త్యాగానికి నిలువెత్తు రూపం
సహనానికి సాక్ష్యం అని
అమ్మ ను ఇంటి పనిమనిషిని చేయోద్దు 
అమ్మ ఆశలను ఆకాంక్షలను
అడిగి తెలుసుకుందాం
అమ్మను మనం కన్న పిల్లలకన్న 
అపురూపం గా చూసుకుందాం
వారానికి ఒక రోజు అమ్మ కు  సెలవిద్దాం
అమ్మకు జై జై
మనను కన్న పూల కొమ్మకు జై జై


కామెంట్‌లు