నేను కవిని- ఉదయించే రవిని -;-అ-కల సోమయ్యదేవరుప్పుల-జనగాం-9640748497
 నేను కవిని 
ఉదయించే రవిని
సంఘంలో పేరుకుపోయిన
ఒక్కొక్క సామాజిక అంశాన్ని
ఏరికోరి తెచ్చి
సామాజిక సాంస్కృతిక చైతన్యానికై
నా కలాన్ని,
నా గళాన్ని పదునెక్కిన 
ఆయుధంగా వాడుతున్నాను
ఇందులో గనిలో
వనిలో కార్ఖానాల్లో
పరిశ్రమించే
పరిప్లవించే
 కార్మిక కర్షకులు
శ్రామికులు
ఇలా
ఎందరెందరివో
కథలు వెతలు 
నేను ఎత్తిచూపుతుంటాను
నాదెప్పుడు ధిక్కార స్వరమే
నేను నా కవితకు
సామాజిక ఇతివృత్తమే
 కవితా వస్తువు
నేనెవడి పంచన బ్రతకను
నేనెవడికి బాకా ఊదను
నేను ప్రజాస్వామ్యబద్ధంగా
 కవిత్వం వ్రాస్తాను
ప్రజాపక్షపాతినై
 నేనుంటాను
కర్మగ్రహచారం అనే ఆత్మన్యూనత సూత్రాన్ని 
వల్లె వేసే
చైతన్య హీనుల్నిచర్నాకోలాతో
నేను తట్టిలేపుతాను
నిత్యచేతనత్వమే
మన ముందడుగని
ప్రబోధిస్తాను

కామెంట్‌లు