పాటల మాంత్రికుడు;-అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగాం-9640748497

 బాలు అంటే 
పాటల, మాటల మాంత్రికుడు
ఎక్స్ప్రెషన్ కింగ్
ప్రతీపాట తొలి పాటగా
పాడే నిత్యసాధకుడు
తనకేమి సంగీత పరిజ్ఞానం లేదంటూనే
సంగీత విద్వాంసులను
తన పాటతో ఆచ్చెరువొందేలా చేసిన పాటమాయగాడు
మధుర గాయకుడు
బాలుకో ప్రత్యేకత ఉంది 
హిరోకృష్ణ గారికి పాడితే కృష్ణ గారి గొంతులో
ఎన్టీ రామారావు గారికి పాడితే అచ్చం రామారావు గారి గొంతులా 
హాస్యనటుడు
అల్లురామలింగయ్య గారికి పాడితే అల్లు రామలింగయ్యలా  పాడిమెప్పించడంలో దిట్ట పాటల పుట్ట మన బాలుడు
ఏ క్షణాన విద్వత్కవీశ్వరులు
ఆచార్య డాక్టర్ సినారె గారు
బాలు అని పేరు ఏముహూర్తాన పెట్టారో కాని
ఆ కవీశ్వరుడి వాక్ బలమో!
బాలుగారి నిత్యసాధన ఫలమో!
తెలియదు కానీ
బాలు మన కాలపు గానగంధర్వుడు
హీరోకు డబ్బింగ్ చెప్పినా
నటించిన
సంగీత దర్శకత్వం వహించినా
తనదైన ముద్ర వేసిన మహాజ్ఞాని
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే
ఫిలాసఫీని తూచతప్పకుండా
పాటించిన
పాటల ఎన్ సైక్లో పిడియా
మన బాలు
ఆబాలగోపాలానికి 
ఇష్టమైన గాయకుడు 
తెలుగు జాతి ఈభూమ్మీదున్నంత కాలం
తెలుగు పాటలు 
అది మన పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం పాటలు బ్రతికే ఉంటాయి 
నూటికో కోటికో ఒక్కరు
ఎప్పుడో ఎక్కడో పుడతారు
అది మీరే మీరే బాలు2

కామెంట్‌లు