బడి అంటే..ఒకగుడిరా...; -అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగాం-9640748497

 బడి అంటే ...
ఒకగుడిరా...
ఆ గుడిలో దేవుళ్ళంటే...
పంతుళ్ళేరా...
చరణం 1 
అక్షరాలను నేర్పారు...
అజ్ఞానం పోగొట్టారు
విజ్ఞానపుజ్యోతులుగా....
వెలిగేలా చేసారు...2
చరణం 2 
/బడి/
పాఠాలను చెప్పారు
ప్రపంచాన్నే చూపారు
ఎక్కడెక్కడ ఏమేముందో..
నొక్కివక్కానించారు...2
/బడి/
చరణం 3
దొంగలు దోచని సొమ్మునురా...
దోపిడీ చేయని సొత్తునురా...
మనకు అందించారు రా...2
అందుకే... అందుకే...
పంతుళ్ళంటే దేవుళ్ళేరా...2
/బడి/

కామెంట్‌లు