బాలుకు మరణంలేదుతెలుగు పాటకు మరణం లేదు ;-అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగాం-9640748497
తెలుగు పాటకు మరణంలేదు 
మన బాలుకు మరణం లేదు2

పుట్టినేర్చితివో పాట
పుట్టకే నేర్చితివో పాట
నీ నోటతేట తెలుగుపాట2
నవరసాలు పండించిన
నీ స్వరం మాకు వరము2

ఎన్నినందులు నీ ఇంటికి
నడిచి వచ్చాయో...2
ఎంత మంది సినీదిగ్గజాలు
నీకై వరసకట్టారో...2

గోదావరి గట్టుందని
నువ్వు పాడితే ...2
గొంతుకలిపిపాడాముమేము
ఒక్కరై రావడంఒక్కరై పోవడం
నడుమ ఈ నాటకం కథేగా
 విధి బలీయమేగా2

స్వర్గంలోక మేగితివా..బాలు
నీ పాట కచ్చేరి చేస్తుంటివా
మాకై ఇలదిగిరావా...
నీ పాటే మాకుప్రాణం 2

పండగైన పబ్బమైన
వేడుకైన వేదనైనా2
నీ పాటమాకుమంత్రం
 ఓ అమరగాయకుడా బాలు2


కామెంట్‌లు