పల్లవి
నీలో... నాలో... మార్పు రావాలి...
ఆ మార్పుదిశగా ...మన నడకసాగాలి...
చరణం 1
చీకటిని చూస్తూ....
చింతిస్తావెందుకు...2
చిరుదీపంవెలిగించి
చీకటిని తరమలేవా..2.
చరణం 2
చుట్టూత చెడినసమాజమని
మథనపడడమెందుకు....2
సామాజిక మార్పుకై... ముందడుగేయవా..2.
చరణం 3
దేశమంత పేదరికమ్మని దెప్పొడుస్తూ మాట్లాడకు... 2
అన్నపూర్ణ నీ దేశమని కలనైనా మరువకు....2
చరణం 4
నిరంతర పరిశ్రమే ....
నీ బ్రతుకుక్కుఆలంబనరా...
మార్పే కోరకుంటే మన(నీ)ప్రగతిశూన్యమేరా....2
చరణం 5
నైపుణ్యం పెంచుకో...
నైరాశ్యం త్రుంచుకో...2
శ్రమసౌందర్యమే... తారక మంత్రం
ప్రగతిశీలతే ...మన బ్రతుకు ఫలసాయం.... 2
నీలో నాలో మార్పు రావాలి ;- అంకాల సోమయ్యదేవరుప్పుల-జనగాం-9640748497
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి